ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి టు అమరావతి

ABN, Publish Date - May 03 , 2025 | 01:35 AM

కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల తోపాటు రంపచోడవరం ఏజెన్సీవాసులకు కూడా అమరావతి అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది. వివిధ పనులపై రాజధానికి వెళ్లడానికి ప్రజలకు ఇబ్బంది తప్పుతుంది. హైదరాబాద్‌తో పోలిస్తే అమరావతి ఉమ్మడి తూర్పు వాళ్లకు దగ్గరే కాకుండా రవాణా సదుపాయమూ సౌలభ్యంగా ఉంటుంది.

అమరావతిలో ప్రధాని సభా ప్రాంగణంలో ఎంపీ హరీష్‌మాధుర్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • మూడు జిల్లాలు, ఏజెన్సీ రాకపోకలకూ అనుకూలం

  • ప్రజాప్రతినిధులకూ సౌలభ్యం

  • పిల్లలకు దగ్గరలోనే ఐటీ ఉద్యోగాలు

  • వైసీపీ హయాంలో ధ్వంసం

  • కూటమి రాకతో పునరుజ్జీవం

  • నూతనోత్తేజంతో రాజధాని పనుల పునః నిర్మాణం శుభారంభం

  • ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి భారీగా తరలివెళ్లిన జనం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

విజన్‌ ఉన్న నాయకుడి అభివృద్ధి.. విధ్వంస నాయకుడి ధ్వంసం మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్లలో ప్రత్యక్షంగా అనుభవించా రు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలకు రాజ ధాని లేకుండాపోయింది. సంక్షోభాల నుంచే అవ కాశాలను సృష్టించుకోవాలని పదేపదే చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపించే సీఎం చంద్రబాబు.. రాజధానిని చరిత్రలో నిలిచి పోయే విధంగా నిర్మించాలని సంకల్పించారు. అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు- విజ యవాడ ప్రాంతంలో నిర్మించాలనుకున్న రాజధా నికి ‘అమరావతి’ అని నామకరణం చేశారు. 2017 మార్చి 2న శాసనసభను ప్రారంభించ డంతో పాలన కూడా మొదలైంది. తర్వాత 2019లో ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా టీడీపీ అధికారం కొనసాగేవి ధంగా ప్రజలు దీవించి ఉంటే ఈనాటికి అద్భు తమైన రాజధాని అమరావతి ఆవిష్కృతమయ్యే ది. కానీ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం.. ప్రజలు జగన్‌కి పట్టంగట్టడంతో రాజకీయ కక్ష ను రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టి అమరా వతిని ధ్వంసం చేశారు. అప్పటివరకూ జరిగిన అమరావతి నిర్మాణాలను నిర్వీర్యం చేశారు. మూడు రాజధానులంటూ ఐదేళ్లు మూడు ముక్కలాటగా నడిచింది. అయితే 2024లో మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఏర్పడిన కూ టమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టడంతో అమరావతికి మంచి రోజు లు వచ్చాయి. ప్రధాని మోదీతో రాజధాని పను లకు శుక్రవారం పునఃప్రారంభం చేయించారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి వాసులకు అమ రావతి అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అమరావతి రాజధానికి వెళ్లాలంటే సగానికి సగం వ్యయ ప్రయాసలు తగ్గినట్టే.

  • అందిపుచ్చుకున్నట్టేగా..

కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల తోపాటు రంపచోడవరం ఏజెన్సీవాసులకు కూడా అమరావతి అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది. వివిధ పనులపై రాజధానికి వెళ్లడానికి ప్రజలకు ఇబ్బంది తప్పుతుంది. హైదరాబాద్‌తో పోలిస్తే అమరావతి ఉమ్మడి తూర్పు వాళ్లకు దగ్గరే కాకుండా రవాణా సదుపాయమూ సౌలభ్యంగా ఉంటుంది. రైలు, బస్సుల్లో మూడు గంటల్లో, విమానంలో 45 నిమిషాల్లో అమరావతికి చేరు కోవచ్చు. కోర్టు, వైద్య పనులపై వెళ్లేవారికి ఇంకా సదుపాయంగా ఉంటుంది. రాత్రి వేళల్లో బస చేసే అవసరం ఉండదు. ఉదయం బయలుదే రితే పనులు చక్కబెట్టుకొని రాత్రి వేళకు ఇంటికి చేరుకోవచ్చు. గోదారోళ్ల రైలు ప్రయాణాలకు రాజమండ్రిని గేట్‌వేలాంటిది. ఈ రైల్వే స్టేషను గుండా విజయవాడ వెళ్లడానికి రోజూ 50కిపైగా రైళ్లు నడుస్తుంటాయి. అరగంటకో బస్సు అందు బాటులో ఉంటుంది. కాకినాడ జిల్లా వాళ్లకూ విజయవాడకు రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి. కోనసీమ జిల్లావాసులకు రావులపా లెం నుంచి కూడా ప్రయాణ సదుపాయం మ రింతగా కలుస్తుంది. అమలాపురం నుంచి మచి లీపట్నం హైవే గుండా కూడా విజయవాడకు సుమారు నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు.

  • వైసీపీ హయాంలో ధ్వంస రచన

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతికి ధ్వంసరచన మొదలైంది. తాత్కా లిక హైకోర్టు మినహా పరిపాలన వంటి తాత్కా లిక భవనాలు తుది దశలో ఉండగా, రహదా రులు వేగంగా నిర్మాణం జరుగుతూ.. ఐటీ కం పెనీలు కుదురుకునే దశలో సీఎంగా పగ్గాలు చేపట్టిన జగన్‌ అమరావతిని నట్టేట ముంచేశా రు. జీఎన్‌ఆర్‌ కమిటీ సిఫారసులంటూ రాజధా ని వికేంద్రీకరణను తెరపైకి తీసుకొచ్చారు. ఐదేళ్ల పాటు మూడు ముక్కలాటను రాష్ట్ర ప్రజలకు చూపించారు. మూడు రాజధానులు కార్యరూ పం దాలిస్తే ఉమ్మడి తూర్పు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారే. ఉదాహరణకు రాజమండ్రి నుంచి కర్నూలు 500 కిలోమీటర్లు, విశాఖపట్నం 200 కిలోమీటర్లు, విజయవాడ 200కిలోమీటర్ల దూరంలో త్రికోణాకారంలో ఉన్నాయి. విజయవాడకు ఉన్న సదుపాయాలు వేటికీ లేవు. దీంతో అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.

  • ప్రజాప్రతినిధులకూ అందుబాటులో..

ఉమ్మడి తూర్పుగోదావరిలో 23 నియోజకవర్గా లు ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌ రాజధానిగా ఉండే సమయంలో ఒక్కరోజు పనిపై అక్కడికి వెళ్లాల్సి వచ్చినా ప్రయాణకాలంతో కలిపి రెండు రోజుల సమయం పట్టేది. నియోజకవర్గంలో అక స్మాత్తుగా ఏదైనా ఘటన జరిగినా హాజరు కావడా నికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. హైదరా బాద్‌ నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే కారులో సుమారు పది గంటలు పడుతుంది. రైలులో అయితే రాత్రి రైలెక్కితే ఉదయం హైదరాబాద్‌ చేరుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి తూర్పునకు రాష్ట్ర రాజధాని 500 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల చేరువకు వచ్చేసింది. దీంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు సైతం ముందు రోజు కాకుండా అదేరోజున ఉదయం బయలుదేరి వెళ్లి సాయంత్రా నికి మళ్లీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వెసులుబాటు కలిగింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సంబంధించి సీఎం కార్యాలయం, రాష్ట్ర సచివాలయం, రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రుల కార్యాలయాల్లో పనులున్నా ఇలా బయలుదేరివెళ్లి.. అలా రాత్రికి వచ్చేయవచ్చు. దీంతో శ్రమ తగ్గడం తోపాటు ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటు లో ఉండే సమయం గణనీయంగా అదా అవుతోం ది. అదే జగన్‌ చెప్పినట్లు మూడు రాజధానులైతే.. ఒక ఎమ్మెల్యే ఇక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకు విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి అధికారులతో పనులకు విశాఖ చేరుకొని, కోర్టు పనులుంటే కర్నూలు వెళ్లి రావాలంటే ఎంత కష్టం.

  • పిల్లలకు దగ్గరలోనే ఉద్యోగాలు

ఓ పదేళ్ల నుంచీ సాఫ్ట్‌వేర్‌ చదువులపైనే పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. కానీ తగిన అవకాశాలు మాత్రం దగ్గరలో లేవు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ కొలువులు కూడా దూరమయ్యాయి. మన దగ్గర చెప్పు కోదగిన కంపెనీలు లేవు. దీంతో 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉండగా మొదలుపెట్టిన అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలకూ పెద్దపీట వేశారు. మైక్రోసాఫ్ట్‌, విప్రో, టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థల ఏర్పాటుకు చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని అటు విశాఖ, ఇటు అమరావతిలోను భారీ రాయితీలిచ్చారు. అయితే జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలోని నిర్మాణంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారి పోయాయి. దీంతో ఐటీ కొలువుల కోసం యువత బెంగళూరు, చెన్నై, హైదరాబా ద్‌లకే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బెంగ తీరనుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మళ్లీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చేవిధంగా సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేశారు. దీంతో అంతర్జాతీయ కంపెనీలతోపాటు మధ్య, చిన్నతరహా ఐటీ కంపెనీలు పెద్దఎత్తున రానున్న కాలంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. మన ఐటీ పిల్లలకు స్వల్ప దూరంలోనే ఉద్యోగ అవకాశాలూ లభించనున్నాయి.

Updated Date - May 03 , 2025 | 01:35 AM