పీఠంలో వైభవంగా వైశాఖ పౌర్ణమి పూజలు
ABN, Publish Date - May 13 , 2025 | 01:01 AM
వెదురుపాక విజయదుర్గా పీఠంలో సోమవారం వైశాఖ పౌర్ణమి పూజలను వైభవంగా నిర్వహించారు.
రాయవరం, మే 12(ఆంధ్రజ్యోతి): వెదురుపాక విజయదుర్గా పీఠంలో సోమవారం వైశాఖ పౌర్ణమి పూజలను వైభవంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని విజయదుర్గ అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకరణ చేశారు. తొలుత విజయ వేంకటేశ్వరస్వామికి సుప్రభాతసేవ, తులసిదళ అర్చనలు చేశారు. అనంతరం విజయదుర్గ అమ్మవారికి లలితా అష్టోత్తర, సహస్ర నామాలు, దుర్గాత్రిశతి, ద్వాతింశ నామావళి, లక్ష్మి, సరస్వతి, దుర్గ అష్టోత్తరాలతో కుంకుమ పూజలు, భవాని శంకర సమేత అష్టలింగేశ్వరస్వామికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా పీఠాథిపతి గాడ్ భక్తులనుద్ధేశించి మాట్లాడారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గ సేవా సమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్యకనకదుర్గ , బుజ్జి, పీఆర్వో బాబి, పలువురు భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 01:01 AM