గొర్రెలు, మేకలకు నట్టల నివారణ వ్యాక్సిన్
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:17 AM
జిల్లాలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి కె.వెంకట్రావు పేర్కొన్నారు.
ఆత్రేయపురం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి కె.వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం ర్యాలిలో గొర్రెలు, మేకలకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 26 నుంచి వచ్చే 10వ తేదీ వరకూ 15 రోజులపాటు దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలి గ్రామంలో 250 గొర్రెలు, మేకలను గుర్తించి నట్టల నివారణ వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. పశువుల ఆసుపత్రిలో మందుల సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరెడ్డి, పశువైద్యాధికారిణి మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 01:17 AM