కిలో నెయ్యి..రూ.250
ABN, Publish Date - May 23 , 2025 | 01:50 AM
ఆత్రేయపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పూతరేకులే.. రోజూ కోట్లాది రూపాయల వ్యా పారం.. ఆ వ్యాపారానికి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
విచ్చలవిడిగా అమ్మకాలు
పూతరేకుల్లో వినియోగం
పశువుల కొవ్వు నుంచి తయారీ
చిరు వ్యాపారులతో అమ్మకాలు
ప్రజారోగ్యంతో చెలగాటం
ఆత్రేయపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆత్రేయపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పూతరేకులే.. రోజూ కోట్లాది రూపాయల వ్యా పారం.. ఆ వ్యాపారానికి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే నెయ్యి వాడని పూతరేకు ఉండదు. ఎన్నో ఏళ్ల కిందట ఆత్రేయపురంలో పుట్టిన పూతరేకుకు దేశ విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. మహిళలు కుటీర పరిశ్రమగా పూతరేకులు తయారుచేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెం దుతున్నారు. పూతరేకులకు డిమాండ్ పెరగ డంతో అక్రమార్కులు ఎక్కడపడితే అక్కడ పూతరేకుల వ్యాపారాలు సాగిస్తూ కల్తీ నెయ్యి వినియోగిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఆత్రేయపురంలో రోడ్ల వెంబడి ఉన్న దుకా ణాల్లో కొందరు వ్యాపారులు గత కొంతకా లంగా యథేచ్ఛగా నకిలీ నెయ్యిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. పశుమాంసం ద్వారా కొవ్వును తీసి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒరిజినల్ నెయ్యిలా ఉండేలా కొన్ని మిశ్రమాలు కలిపి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్టు సమాచారం. ఏలూరు, విజయవా డ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఈ నకిలీ నెయ్యిని తెచ్చి వ్యాపారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆత్రేయపురంలోని కొన్ని షాపుల ద్వారా ఈ నెయ్యి వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ కల్తీ నెయ్యిని కిలో రూ.250కు చిరువ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధర తక్కువగా ఉండడం.. చూస్తే నెయ్యిలా కనిపించడంతో ఆ నెయ్యినే వినియో గించి కొందరు పూత రేకులు తయారుచేస్తు న్నారు. ఈ కల్తీనెయ్యి విచ్చలవిడిగా వినియో గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. క్యాన్సర్, ఉదర సంబంఽధిత వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు పూతరేకుల తయారీ, నెయ్యి వ్యాపారుల స్థావరాలపై దా డులు చేసి కేసులు పెట్టినా షరామామూలే.
80 కిలోల కల్తీ నెయ్యి స్వాఽధీనం
ఆత్రేయపురంలోని కల్తీ నెయ్యి అమ్మకాలు సాగిస్తున్న ఓ షాపుపై స్థానికులు గుర్తించి పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అం దించారు. ఆత్రేయపురం శ్రీలక్ష్మి డ్రైఫూట్స్ షాపులో గురువారం 80 కిలోల కల్తీనెయ్యిని పట్టుకుని స్థానికులు పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. షాపునకు చెందిన గొడౌన్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 80 కిలోల కల్తీనెయ్యిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రాము ఫుడ్‌సేఫ్టీ అధికారులకు సమాచారం అందిం చారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి శ్రీకాంత్‌చౌదరి కల్తీ నెయ్యి సీజ్ చేశారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
Updated Date - May 23 , 2025 | 01:50 AM