మధ్యాహ్న భోజనం తిని 21 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN, Publish Date - Jul 12 , 2025 | 01:09 AM
ఎటపాక,జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. ఈ ఘటన అల్లూరి జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జడ్పీ ఉన్నత పాఠ శాలలో జరిగింది. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 విద్యార్థులు చదువుతు న్నా రు. శుక్రవారం మ
పాఠశాలలో పులిహోర,
టమోటా పచ్చడి వడ్డింపు
తిన్న పది నిమిషాల్లో కొందరికి వాంతులు, కడపునొప్పి
గౌరిదేవిపేట పీహెచ్‌సీకి తరలింపు
ఎటపాక,జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. ఈ ఘటన అల్లూరి జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జడ్పీ ఉన్నత పాఠ శాలలో జరిగింది. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 విద్యార్థులు చదువుతు న్నా రు. శుక్రవారం మధ్యాహ్న భోజనం సమయం లో విద్యార్థులకు పులిహోర, టమోటా పచ్చడి వ డ్డించారు. అది తిన్న విద్యార్థులు పది నిమిషాల్లో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వారిని సమీపంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించారు. మొ త్తం 21మంది అస్వస్థతకు గురవ్వగా అందులో ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులే ఉన్నారు. అందులో ఆకుల రామలక్ష్మీ, బొగ్గా ప్రేమిక, రాయి లోకేశ్‌కు వాంతులు కావడంతో సెలైన్లు ఎక్కించి చికిత్స అందించారు. మరో 18 మంది విద్యా ర్థులకు కడుపు నొప్పి రావడంతో ప్రథమ చికిత్స చేశారు. అయితే ఊడికీ ఉడకని పులిహోర తినడం వల్లే విద్యార్థులకు అజీర్తీ చేసిందని, దాంతో అస్వస్థతకు గురైనట్టు వైద్యాధికారి దీవీనాగ్ తెలిపారు. కాగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంటషెడ్డులేక బరకాలు కట్టి అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారుచేస్తున్నట్టు విద్యా ర్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. బరకాలపై నుంచి ఆహారంపై ఈగలు, బొద్దింకలు పడుతున్నా యని విద్యార్థులు చెప్తున్నారు.
విచారణకు పీవో ఆదేశం
విద్యార్థులకు అస్వస్థత విషయం తెలుసుకున్న ఐటీడీఏపీవో అపూర్వ భరత్ వెంటనే స్పందించారు. ఘటన పై వెంటనే విచారణ జరిపి నివేదిక అంద జేయాలని ఎంఈవో సరియం రాజులును ఆదేశిం చారు. దాంతో ఎంఈ వెంటనే గౌరిదేవిపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులతో విచారణ జరిపారు. ఘటనకు గల కారణాలు, వి ద్యార్థులకు వడ్డించిన ఆహారం విషయంపై అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పీవో అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Jul 12 , 2025 | 01:09 AM