ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : వైసీపీ

ABN, Publish Date - May 06 , 2025 | 01:59 AM

ధాన్యం రైతుల నుంచి కొనుగోలుచేసి మద్దతు ధర కల్పించాలని తడిసిముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

అమలాపురం,మే5(ఆంధ్రజ్యోతి): ధాన్యం రైతుల నుంచి కొనుగోలుచేసి మద్దతు ధర కల్పించాలని తడిసిముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమంలో భాగంగా వైసీపీకి చెందిన జిల్లా నాయకులంతా కలెక్టర్‌ చాంబర్‌లో కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌, నియోజకవర్గ కోఆర్డినేటర్లు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, పిల్లి సూర్యప్రకాష్‌, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 01:59 AM