ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫైర్‌ ‘నో’ స్టేఫ్టీ!

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:46 AM

ఫైర్‌ సిబ్బంది పనితనం ఎప్పుడు తెలుస్తుం ది.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారు హుటా హుటిన చేరుకుని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చినప్పుడే కదా..ప్రమాదం జరిగిన ప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ అందుబాటులో లేకపోతే ఎలా? ప్రమాదాలను ఏమి అదుపు చేస్తారు..

రాజమహేంద్రవరంలో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం

వెన్నాడుతున్న సిబ్బంది కొరత

ఆఫీసు పనులకు కేటాయింపు నిల్‌

తూర్పులో రెస్క్యూ బోటుకు చిల్లు

మూడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఫైర్‌ సిబ్బంది పనితనం ఎప్పుడు తెలుస్తుం ది.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారు హుటా హుటిన చేరుకుని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చినప్పుడే కదా..ప్రమాదం జరిగిన ప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ అందుబాటులో లేకపోతే ఎలా? ప్రమాదాలను ఏమి అదుపు చేస్తారు.. ఎవరిని రక్షిస్తారు.. రాజమహేంద్ర వరంలో శుక్రవారం ఎదురైన సంఘటనే అందుకు నిదర్శనం. ఫైర్‌స్టేషన్‌కు 2 అడుగుల దూరంలో ప్రమాదం జరిగినా ఫైర్‌ సిబ్బంది చేరుకోవడా నికి 45 నిమిషాలు పట్టింది. విపత్తు సంభవించినప్పుడు ప్రతి సారీ ట్యాం కులో నీళ్లు నింపుకొని వెళ్తే పని జరగదు. విపత్తు నిర్వహణకు మానవ వనరులు, ఇతర పనిముట్లు లేకుండా చేసేదేమీ ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఎంత త్వరగా ఘటనా ప్రదేశానికి చేరుకుంటారనే అంశంపైనే నష్ట నివారణ ఆధారపడి ఉంటుంది. కానీ అగ్ని మాపకశాఖను కొరతలు వేధిస్తుండడంతో కాగి తాల్లో లెక్కలకు వాస్తవ పరిస్థితికి వ్యత్యాసం ఉంటోంది. రెస్య్కూ పరికరాలు మరమ్మతుల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సగం సిబ్బం దితోనే ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఒక షూమార్ట్‌లో శుక్ర వారం ఉదయం ఫైర్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా చేరుకోవడానికి 45 నిమిషాలు సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. జూన్‌ 4న గోదావరి లంక నుంచి నాటు పడవలో చీకటి పడిన వేళ వస్తూ ప్రమాదానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు.సమాచారం అం దిన వెంటనే ఫైర్‌ ఇంజనుతో అగ్నిమాపక సిబ్బంది పుష్కరాల రేవుకు చేరుకున్నారు. తక్ష ణమే రంగంలోకి దిగాల్సి ఉన్నా దిగాలుగా నిలబడడం తప్పలేదు. ఎందుకంటే అందు బాటులో ఉన్న ఒక్క రెస్క్యూ బోట్‌కి చిల్లు పడిందని తెలిసింది. దీంతో గాలింపునకు నాటు పడవలే దిక్కయ్యాయి.దీంతో 4 గంటల క్లిష్ట మైన సమయం గడిచిపోయింది. ఇటువంటి ఘటనలు అగ్నికి ఆజ్యంగా మారుతున్నాయి. 7 జిల్లాలకు సంబంధించి జోన్‌-2 ప్రాంతీయ ఫైర్‌ అధికారి రాజమండ్రిలోనే ఉన్నా పూర్తి స్థాయిలో విపత్తు నిర్వహణ కానరావడం లేదనే ఆరో పణలు వినవస్తున్నాయి.తూర్పుగోదావరి, కాకి నాడ,అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని విపత్తు నిర్వహణ శాఖ తిప్పల పై ‘ఆంధ్రజ్యోతి’ కథనం

సిబ్బంది కొరత

విపత్తు నిర్వహణ శాఖలో సిబ్బంది కొరత అంతర్గత విపత్తులా మారింది. సిబ్బంది సరి పడా లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. అత్యవసర సర్వీసు కాబట్టి డ్యూటీల్లో వెసులుబాట్లు ఉం డడంలేదు. దీంతో ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడుతుండగా.. కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిక్యూటీవ్‌ స్టాఫ్‌ కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 150 వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏవో, జేఏవో,సూపరింటెండెంట్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కార్యాలయ నిర్వహణకు అవసరం. వీరిని మినిస్టీరియల్‌ సిబ్బంది అంటారు. అయి తే మూడు జిల్లాలకు ఇద్దరేసి చొప్పున జూని యర్‌ అసిస్టెంట్ల పోస్టులు మాత్ర మే కేటా యింపు ఉంది. కోనసీమ, తూర్పు గోదా వరిలో వారూ లేరు.అధికారులే లెటర్‌ టైప్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

పనిముట్ల పరిస్థితీ అంతే

విపత్తు వేళ సిబ్బంది ఎంత సామర్థ్యం కలి గిన వారు ఉన్నా పనిముట్లు, పరికరాలు లేక పోతే సమయం వృథా తప్పదు. కళ్ల ముందే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మూడు జిల్లా లోని రెస్క్యూ ఎక్విప్‌మెంట్‌ పూర్తి స్థాయిలో మనుగడలో లేదు.కొన్ని మరమ్మతులో ఉండగా, మరికొన్ని మూలకు చేరిపోయాయి.పలు స్టేష న్లలో అన్నీ ఉన్నా సరిపడా సిబ్బంది లేరు. గోదావరికి వరదల సమయంలో జనాన్ని, పశు వులను రక్షించడానికి కూడా నాటు పడవలే గత్యంతరం. తూర్పుగోదావరిలో విస్తార గోదా వరి తీరం ఉంది.ప్రతి ఏడాదీ వరదలు సహ జమే. ఈ నాటికీ ఒక్క రెస్క్యూ బోటు కూడా సమకూర్చుకోలేని దైన్యంలో విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ కొట్టుమిట్టాడుతోంది.

Updated Date - Aug 04 , 2025 | 12:46 AM