ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్ధరాత్రి అలజడి!

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:47 AM

రామచంద్రపురం (ద్రాక్షారామ), ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లా రామచంద్రపురం మార్కెట్‌ సెంటర్‌ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. సంబరాల్లో మంగళవారం అర్ధరాత్రి 12.51 గంటలకు బాణసంచా కాల్పుల్లో భారీ విస్పోటనం సంభవించింది

పేలుడుకు ధ్వంసం అయిన వికాస్‌ కళాశాల కంప్యూటర్‌ ల్యాబ్‌

బాణసంచా కాల్పుల్లో భారీ విస్పోటనం

భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు

రామచంద్రపురంలో

కంపించిన భవనాలు

పగిలిన వాణిజ్య సముదాయాలు, భవనాల అద్దాలు,

రూ.18.20 లక్షల ఆస్తినష్టం

రామచంద్రపురం (ద్రాక్షారామ), ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లా రామచంద్రపురం మార్కెట్‌ సెంటర్‌ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. సంబరాల్లో మంగళవారం అర్ధరాత్రి 12.51 గంటలకు బాణసంచా కాల్పుల్లో భారీ విస్పోటనం సంభవించింది. పే లుడుధాటికి మార్కెట్‌ సెంటర్‌లోని రైతుబజార్‌ పరిసర ప్రాంతాల్లో వాణిజ్యసముదాయాలు, వికాస్‌ కళాశాల, సినిమా థియేటర్లు, పలు భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 1000 మీటర్లు వరకు పేలుడు ప్రభావం కనిపించింది. లక్ష ల్లో ఆస్తినష్టం సంభవించింది. అర్ధరాత్రి భవనాలు కంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. భయంతో రోడ్లపైకి చేరుకున్నారు.

అసలేం జరిగిందంటే....

వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో మంగళ వారం రాత్రి నుంచి బాణసంచా కాల్పులు ప్రార ంభించారు. 12.50 గంటల ప్రాంతంలో పేలుడు స్తంభం వెలిగించారు. అది దశలవారీగా పేలవలసి ఉంది. అయితే స్తంభానికి చుట్టిన నార ఔట్లు, టపాసులదండ జారి పోవడంతో భారీ విస్పోటనం సంభవించింది. పేలుడు దాటికి పక్క నే ఉన్న వికాస్‌ కళాశాల కంప్యూటర్‌ ల్యాబ్‌ అద్ధాలు ధ్వంసం కావడంతో పాటు మూడో అంతస్తులో క్లాసురూముల్లో పీవోపి సీలింగ్‌ ఊ డిపడిపోయింది. గోడలు బీటలు వారాయి. కళాశాల బస్సు అద్దాలు పగిలిపోయాయి. కంప్యూట ర్‌ ల్యాబ్‌లో సీసీ కెమెరాలో పేలుడు దాటికి అ ద్దాలు ధ్వంసం కావడం రికార్డుఅయింది. రెండు నిమిషాలకుపైగా అద్దాలు ధ్వంసం కావడం కని పించింది. పక్కనే ఉన్న వెంకటరమణ సిమెం టు, ఐరన్‌ట్రేడర్స్‌ షాపుల సముదాయంలో నష్టం సంభవించింది. హవెల్స్‌ షోరూమ్‌, సెరా స్టైల్‌ సెంటర్‌ అద్దాలు పగిలిపోయాయి. షట్టర్లు వేసి ఉండగానే 18 అంగులాలు మందం కలిగిన అద్దాలు, డిస్‌ప్లే హోర్డింగులు, సీలింగులు ధ్వంసం అయ్యాయి. సమీపంలో కిషోర్‌ సినిమా థియేటర్‌, అన్నపూర్ణ థియేటర్‌ అద్దాలు పగిలిపోయాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించింది. పేలుడు ధాటికి పలు భవనాలు కంపించడంతో భూకంపం ఏమైనా వచ్చిందా అనే భయంతో ప్రజలు ఆందోళన చెందారు. రోడ్లపైకి చేరుకున్నా రు. బాణసంచా ప్రేలుడు నిర్ధారించుకుని ఊపి రి పీల్చుకున్నారు. పేలుడు దాటికి పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తీసుకుని వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు.

అధికారులు, నాయకుల పరిశీలన

పేలుడు జరిగిన ప్రాంతం, సమీపంలో నష్టపోయిన వెంకటరమణ ట్రేడర్స్‌, వికాస్‌ కళాశాల ప్రాంతాలను ఆర్డీవో అఖిల, డీఎస్పీ రఘువీర్‌ పరిశీలించారు. రూ.18.20 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్టు ఆర్డీవో తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, మంత్రి సుభాష్‌ తండ్రి వాసంశెట్టి సత్యం నష్టపోయిన వారిని పరామర్శించారు. విస్పోటనం దాటికి నష్టపోయిన వెంకటరమణ ట్రేడర్స్‌, వికాస్‌ కళాశాల, సినియా థియేటర్లతో పాటు పలువురు భవనాల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు. నష్టానికి కారణమైన ఆంజ నే య ఫైర్‌వర్క్స్‌ దవులూరి శివ, కమిటీ సభ్యుల ను అదుపులోకితీసుకుని విచారిస్తున్నామన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:47 AM