ఉగ్రవాదంపై పోరుపై అమెరికా ఉపాధ్యక్షుడిని కలిసిన భారత్ బృందం
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:19 AM
ఉగ్రవాదంపై అమెరికా భారత్‌కు మద్దతు తెలుపుతోందని ప్రతినిధి బృందంలో ఒకరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వార్న్స్‌తో శశిథరూర్ నాయకత్వంలో వెళ్లిన అఖిలపక్షం బృందం ఆపరేషన్ సిందూర్ నేపథ్యాన్ని వివరించారు.
అమలాపురం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదంపై అమెరికా భారత్‌కు మద్దతు తెలుపుతోందని ప్రతినిధి బృందంలో ఒకరైన అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వార్న్స్‌తో శశిథరూర్ నాయకత్వంలో వెళ్లిన అఖిలపక్షం బృందం ఆపరేషన్ సిందూర్ నేపథ్యాన్ని వివరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వార్న్స్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఏ పరిస్థితిలో దాడికి పాల్పడాల్సి వచ్చిందో వివరించడం ద్వారా వారి మద్దతును కూడగట్టుకున్నట్టు ఎంపీ హరీష్ తెలిపారు. పహల్గాంలో 25 మందిని ఏవిధంగా పొట్టన పెట్టుకున్నారో వివరించామని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌లో మరణించిన వారికి సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపిన పోస్ట్‌ను ఉపసంహరించుకుందని, కొలంబియా దేశం మనకు మద్దతు తెలియచేయడానికి ఇదే ఉదాహరణని హరీష్ వ్యాఖ్యానించారు.
Updated Date - Jun 07 , 2025 | 01:19 AM