ఫీజులుం!
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:52 AM
గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను నిండా ముంచేసింది. నాడు ఫీజులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పాపం ప్రస్తుత ప్ర భుత్వానికి చుట్టుకుంది. దీంతో సుమారు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలకే సుమారు వెయ్యి కోట్ల వరకూ ఫీజు బకాయిలు ఉన్నట్టు సమాచారం.
కాలేజీ యాజమాన్యాల పట్టు
ఇంజనీరింగ్ విద్యార్థుల ఇక్కట్లు
రూ.1140 కోట్ల ఫీజు బాకీలు
ఉద్యోగాలకు ప్రయత్నాలు
సర్టిఫికెట్లు ఇవ్వడానికి ససేమిరా
బాకీలు చెల్లించాలని డిమాండ్
జమకాని ఫీజు రీయింబర్స్‌మెంట్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను నిండా ముంచేసింది. నాడు ఫీజులు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పాపం ప్రస్తుత ప్ర భుత్వానికి చుట్టుకుంది. దీంతో సుమారు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలకే సుమారు వెయ్యి కోట్ల వరకూ ఫీజు బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో వేలాది మంది ఇంజనీరింగ్ విద్యా ర్థులకు కాలేజీలు చుక్కలు చూపిస్తున్నాయు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వ కుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఫీజు బకాయి చెల్లించేవరకు వాటిని ఇవ్వబోమంటూ సతా యిస్తున్నాయి. సకాలంలో తమ సర్టిఫికెట్లను కంపెనీలు, ఇతర విద్యాసంస్థలకు ఇవ్వకపోతే అవకాశాలు పోతాయని మొత్తుకుంటున్నారు. అటు కాలేజీ యాజమాన్యాలేమో తమకు ప్రభు త్వం నుంచి ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులే చెల్లించాలని తెగేసి చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.540 కోట్ల వరకు ఉన్నాయి. ఇది కాకుండా గత వైసీపీ హయాంలో 600 కోట్లు వరకూ బాకీలు ఉండడం గమనార్హం.
బకాయిలు..ముప్పుతిప్పలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జేఎన్టీయూ పరిధిలో మొత్తం 28 వరకు ఇంజ నీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో పది కాలే జీలు ఒక్క కాకినాడ జిల్లాలోనే ఉన్నాయి. మిగి లిన 18 కాలేజీలు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. మొత్తం 28 కాలేజీల్లో ఇంజ నీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులు 12 వేల మంది ఉన్నారు. విద్యార్థుల్లో అనేక మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు లభించాయి. కొందరేమో ఉన్నత చదువులకు వెళుతున్నారు. ఈ నేపథ్యం లో సర్టిఫికెట్లు ఉండాలి. తీరా ఇప్పుడు ఇంజనీ రింగ్ చదివిన కాలేజీలు వీటిని ఇవ్వ కుండా ఇబ్బంది పెడుతుండడంతో లబోదిబో మంటు న్నారు. కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని తెగేసి చెప్పేయడంతో ఎంత బతిమా లినా సిబ్బంది వీటిని ఇవ్వడం లేదు. దీంతో కొం దరు అత్యవసరం అనుకున్న విద్యార్థులు అప్పు లుచేసి ఫీజులు కడుతున్నారు. లేదంటే ఉద్యోగం పోతుందనే భయంతో బాకీలు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
విద్యార్థుల జీవితాలతో ఆటలు
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కాలేజీలు తమ బకాయిలకు రాజధానిలో ఉన్న తాధికారులతో మాట్లాడుతున్నా స్పందన ఉండడం లేదు. పోనీ బాకీలు వేగంగా వస్తే సర్టిఫికెట్లు ఇవ్వాలని భావిస్తున్నా అది జరగడం లేదు. మరోపక్క బాకీలు రాకుండా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నష్టపోతామని భావిస్తున్నాయి. ప్రభు త్వం మారాక ఒక వాయిదా బాకీలు కాలేజీలకు అందాయి. ఇంకా మిగిలినవి రావాల్సి ఉందని చెబుతున్నాయి.అయితే ఫైనలియర్ విద్యార్థులు నాలుగు నుంచి ఐదు వాయిదాల వరకు బా కీలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నాయి. దీం తో ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంజ నీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానాపాట్లు పడుతున్నారు. కొందరైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయంబర్స్‌మెంట్ డబ్బులు మినహా మిగిలినవన్నీ చెల్లిస్తామని కాలేజీలను ప్రాథేయపడుతున్నాయి. కానీ యా జమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు తల లు పట్టుకున్నారు. ఇంతకాలం ఎంతో కష్టపడి చదివి చివరిలో ఇదేంటిరా అంటూ తలలు బా దుకుంటున్నారు. కొన్ని కాలేజీలైతే మరీ దారు ణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఎంపికైన విద్యా ర్థులను సైతం బకాయిల పేరుతో వేధి స్తుండడంతో వారంతా కన్నీటి పర్యంతమవుతు న్నారు. వాస్తవానికి గత వైసీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను తల్లుల ఖా తాల్లో జమ చేసేవారు. ప్రభుత్వం మారాక నేరు గా కాలేజీల ఖాతాల్లోనే జమవుతున్నాయి.
రూ.1140 కోట్లుపైనే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీలు రూ.వెయ్యి కోట్ల వరకు పేరుకుపోయాయి.గత వైసీపీ హయాంలో రూ.600 కోట్ల వరకూ ఉన్నాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.540 కోట్లు బకాయి ఉంది. దీంతో సర్టిఫికెట్లు ఆపి విద్యార్థుల నుంచి బాకీలు కట్టించుకోవాల్సి వస్తుందని యాజమాన్యాలు అధికా రులకు సంజాయిషీ ఇస్తున్నాయి.ప్రధానంగా కాకినాడ జిల్లా మెట్టప్రాం తంలో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజు రీయిం బర్స్ మెంట్ బాకీలు సెకండ్ ఇయర్ నుంచి ఫైనలియర్ విద్యార్థులవి కలిపి రూ.90 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. దానికి సమీపంలో ఉన్న మరో కాలేజీకి రూ.15కోట్ల వరకు పేరుకుపోయాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు భారీ ఇంజనీరింగ్ కాలేజీల బకాయిలే రూ.240 కోట్ల వరకు ఉన్నాయి. ఇవికాక మధ్యస్తంలో ఉండే పది కాలేజీల బకాయిలు రూ.150 కోట్లు, మిగిలిన మరో పది కాలేజీల బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నాయని ఆయా యాజమాన్యాలు వివరిస్తున్నాయి.
Updated Date - Jul 16 , 2025 | 12:52 AM