మళ్లీ రోడ్డెక్కిన అన్నదాత
ABN, Publish Date - May 25 , 2025 | 01:53 AM
అన్నదాత మళ్లీ రోడ్డెక్కాడు.. ఆరు గాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొను గోలు చేయాలని, డబ్బులు తమ ఖాతాలకు జమ చేయా లని కొందరు రైతులు డిమాండ్ చేశారు.
నిడదవోలు, మే 24 (ఆంధ్రజ్యోతి) : అన్నదాత మళ్లీ రోడ్డెక్కాడు.. ఆరు గాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొను గోలు చేయాలని, డబ్బులు తమ ఖాతాలకు జమ చేయా లని కొందరు రైతులు డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామం లోని సెంటరులో శనివారం రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. రైతులు వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసిందన్నారు.తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొందరు రైతులు భీష్మించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు..ఈ నెల 7వ తేదీ నుంచి విక్రయించిన ధాన్యానికి సొమ్ములు రావడం లేదని మరి కొందరు రైతులు వాపోయారు. జాయింటు కలెక్టర్ తమ వద్దకు రావాలని డిమాండ్ చేశారు.నిడదవోలు మండలంలో 60 వేల మెట్రిక్ టన్నులు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 53 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. మిగిలిన 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు టార్గెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిడదవోలు మండలానికి టార్గెట్ వచ్చేలా చేస్తామని కొవ్వూరు ఏడీఏ పి.చంద్రశేఖరరావు రైతాంగానికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సోమవారానికల్లా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ధర్నా కారణంగా నిడదవోలు నరసాపురం ప్రధాన మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Updated Date - May 25 , 2025 | 01:53 AM