అన్నదాతకు ఆనంద‘మే’!
ABN, Publish Date - May 06 , 2025 | 01:02 AM
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అం దించింది. సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా అన్న దాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. కుటుంబం యూ నిట్‌గా రైతుకు రూ.20 వేల చొప్పున మూడు విడతల్లో సాయం అందించడానికి కసరత్తు చేస్తోంది.
అన్నదాత సుఖీభవ అమలుకు గ్రీన్‌సిగ్నల్
ఉమ్మడి జిల్లాలో కసరత్తు
ఈనెల 20కే అర్హుల జాబితా
అనర్హుల వడపోత
కొత్తగా మార్పులుచేర్పులు
అధికారులకు లాగిన్
4.85 లక్షల మందికి లబ్ధి
రూ.970 కోట్ల నిధులు అవసరం
కౌలు రైతులకూ వర్తింపు
1.80 లక్షల మందికి మేలు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అం దించింది. సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా అన్న దాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. కుటుంబం యూ నిట్‌గా రైతుకు రూ.20 వేల చొప్పున మూడు విడతల్లో సాయం అందించడానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయశాఖ అధి కారులు పథకం అమలుకు వీలుగా రైతుల వివ రాలను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న అన్నదాతల జాబితా వడపోతకు సన్నాహాలు ఆరంభించారు. వీరికి ప్రభుత్వం తాజాగా లాగిన్‌లు కేటాయించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.85 లక్షల మంది రైతులు అర్హులుగా తేలనున్నారు. రూ.970కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
రైతన్నకు ఆర్థిక భరోసాయే..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ సూప ర్‌సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం దగాతో మోస పోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటిం చింది. రైతు భరోసా పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచి కేవలం కేంద్ర వాటాతో కలిపి రూ. 13,500 ఇచ్చి చేతులు దులిపేసుకున్న తీరును తప్పుబట్టింది. ఈనేపథ్యంలో రైతులకు అండగా ఉండడడానికి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్నికల ముందు ప్రకటించారు. అర్హు డైన ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల బడ్జెట్‌లో పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించారు. పథకం అమ లెప్పుడా అని రైతులు ఎదురుచూస్తోన్న తరు ణంలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు రైతులకు తీపికబురు అందించారు. పథకాన్ని ఈ నెలలో ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా అన్ని జిల్లాల వ్యవసాయ శాఖలకు గత వైసీపీ హయాంలో రైతు భరోసా పథకం తీసుకున్న అన్నదాతల జాబితాలను పరిశీల నకు పంపించింది. వీటిని మండలస్థాయిలో వ్య వసాయ శాఖ అధికారులు వడపోత పోయా లని ఆదేశించింది. ఇప్పుడు మండలాలవారీగా అధికారులకు జాబితాలో మార్పులు చేర్పులకు వీలుగా లాగిన్‌లు సైతం కేటాయించింది. ప్రభు త్వం పంపిన జాబితాను రెండు వారాలపాటు అధికారులు మండల స్థాయిలో క్షుణ్ణంగా పరి శీలించనున్నారు. అనంతరం కాకినాడ, కోన సీమ, తూర్పుగోదావరి జిల్లాల వారీగా పథకం పరిధిలోకి ఎంతమంది రైతులు వస్తారనే దానిపై జాబితా తయారుచేస్తారు. అనర్హులను తొలగిస్తారు. ఆదాయపన్నుదారులు ప్రభుత్వ ఉద్యోగులు, భూస్వాములను గుర్తించి పేర్లను తప్పించనున్నారు. కొత్తగా అర్హులను గుర్తించి జాబితాలో చేర్చనున్నారు. ఈనెల 20 నాటికి అర్హులతో కూడిన జాబితా సిద్ధం చేయనున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు వివరించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.85 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చొప్పున రూ.970 కోట్ల వరకు చెల్లిం చాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కౌలు రైతులకు పండగే..
ఉమ్మడి జిల్లాలో 4.54 లక్షల మంది వరకు అన్నదాతలు పథకం అమలు కిందకు రాను న్నారు.అయితే రాష్ట్రప్రభుత్వం సాఽధ్యమైనంత ఎక్కువమంది రైతులకు పథకం వర్తింపజే యాలని నిర్ణయించింది.గత వైసీపీ హయాం లో రకరకాల సాకులతో అర్హులను జగన్ ప్రభు త్వం పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో అన్న దాతలను ఇబ్బంది పెట్టకుండా దాదా పు అందరికీ లబ్ధి చేకూర్చాలని సీఎం చంద్ర బాబు తాజాగా అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా కొత్తగా కౌలు రైతులను పథకం పరిధిలోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో 65 వేలు, కోనసీమ జిల్లాలో 61 వేలు, తూర్పుగోదావరి జిల్లాలో 54 వేల మంది వరకు అన్నదాతలు పథకం పరిధిలోకి రానున్నారు.ఒకరకంగా కౌలు రైతులకు ఇది వరమే అని చెప్పాలి. ప్రస్తుతం కౌలు రైతు కార్డులు కలిగిన వారినే అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇవిలేని వారిని పథకం పరిధిలోకి తీసుకు వస్తే జాబితా మరింత పెరగనుంది. మరో పక్క గత ప్రభుత్వం వీరిని అసలు రైతులు గానే పరిగణించలేదు. కానీ కూటమి ప్రభు త్వం వీరిని కూడా అర్హుల జాబితాలోకి చేర్చి ంది.అటవీ భూములపై హక్కులు (ఆర్‌ఓ ఎఫ్‌ఆర్) కలిగిన అన్నదాతలకు పథకం ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనివల్ల కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు,శంఖవరం, రౌతు లపూడి మండలాల్లో అటవీభూములు సాగు చేస్తోన్న వెయ్యి మంది వరకు అన్నదాతలకు ఆర్థిక లబ్ధి కలగనుంది. గతంలో వీరిని ఏప్రభు త్వంకనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.
Updated Date - May 06 , 2025 | 01:02 AM