ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెటిల్‌ చేసుకోకపోతే షాప్‌ సీజ్‌ చేస్తాం..!

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:39 AM

పిఠాపురం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మీరు కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారు... వయాగ్రా మాత్రలు అమ్మారు... ఇలా మీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. మేము వస్తే షాప్‌ సీజ్‌ చేస్తాం. మీరు వచ్చి డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకోండి అంటూ డీఎంహెచ్‌వో కార్యాలయం నుం చి ఫోన్‌ చేస్తున్నామంటూ

  • ఉమ్మడి జిల్లా పరిధిలోని మెడికల్‌ షాపుల నిర్వాహకులకు ఫేక్‌ కాల్స్‌

  • డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి అంటూ బెదిరింపు

  • కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా కెమిస్టులు

పిఠాపురం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మీరు కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారు... వయాగ్రా మాత్రలు అమ్మారు... ఇలా మీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. మేము వస్తే షాప్‌ సీజ్‌ చేస్తాం. మీరు వచ్చి డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకోండి అంటూ డీఎంహెచ్‌వో కార్యాలయం నుం చి ఫోన్‌ చేస్తున్నామంటూ కొందరు ఆగంతకులు మెడికల్‌ షాపు యజమానులకు ఫేక్‌ ఫోన్లు చేస్తున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల పరిధిలోని పలు షాపుల నిర్వాహకులకు గత 3 రోజులుగా పదుల సంఖ్యలో ఫేక్‌ ఫోన్లు రావడంతో కాకినాడ జిల్లా డ్రగ్గిస్ట్‌ అండ్‌ కెమిస్ట్స్‌ అసోసియేషన్‌ అప్ర మత్తమైంది. కాకినాడ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో జిల్లా సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కాకినాడతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు, తుని, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, ఏలేశ్వరం తదితర ప్రాంతాల్లోని మెడికల్‌ షాపుల నిర్వాహకులకు కొందరికి 7032461950 నెంబర్‌ నుంచి కాల్స్‌ వచ్చినట్టు చెబుతున్నారు. ఇది హైదరాబాదులోని ఒక కాల్‌ సెంటర్‌ నుంచి వచ్చినట్టు స మాచారం. ఇవన్ని తప్పుడు కాల్స్‌ అని, ఇటువంటివి వచ్చినప్పుడు సంభాషణ రికార్డు చేయాలని డ్రగ్గిస్టు అండ్‌ కెమిస్ట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈ కాల్స్‌ చేసిన వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.

Updated Date - Jul 23 , 2025 | 10:59 AM