గోదారి..వయా..గ్రా:
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:23 AM
మెడికల్ షాపులకు వెళ్లి ఏ మందు అడిగినా లేదనే సమాధానం రాదు..నిన్నటి వరకూ జ్వరం, దగ్గు, జలుబు మందులే అనుకుంటే.. ఇటీవల ఒక యువకుడు పట్టుబడడంతో అసలు విషయం బయటపడింది..
డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకున్నా ఓకే
అందుబాటులో అబార్షన్ ట్యాబ్లెట్లు
ఇబ్బడిముబ్బడిగా వయాగ్రా అమ్మకాలు
దగ్గు మందులకు అడ్డేలేదు
కొరవడిన డ్రగ్స్ శాఖ నిఘా
మామ్మూళ్ల మత్తే కారణం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
మెడికల్ షాపులకు వెళ్లి ఏ మందు అడిగినా లేదనే సమాధానం రాదు..నిన్నటి వరకూ జ్వరం, దగ్గు, జలుబు మందులే అనుకుంటే.. ఇటీవల ఒక యువకుడు పట్టుబడడంతో అసలు విషయం బయటపడింది.. వయాగ్రా, అబార్షన్ మాత్రలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టు తెలియడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నివ్వెరపోయింది.. డ్రగ్స్ శాఖ మామూళ్ల మత్తులో జోగుతుండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. దీనిపై ఆంధ్రజ్యోతి నిఘా పెట్టగా అన్ని మెడికల్ షాపుల్లోనూ ఈ తంతు నడుస్తున్నట్టు తెలుస్తోంది..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ శాఖ మత్తు బిళ్లలు వేసుకోవడంతో మెడికల్ షాపుల వ్యాపారం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడు తోంది. అధిక శాతం మెడికల్ షాపుల్లో అడి గిందే తడవుగా విచ్చలవిడిగా మందులను విక్రయిస్తున్నారు. ఎంతలా అంటే.. వైద్యుడి చీటీ లేకుండా షెడ్యూల్ ‘హెచ్’ మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదు. కానీ అవే మీ పెద్దగా పట్టింపు లేకుండా వ్యాపారాలు నడిచిపోతున్నాయి. ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్) శాఖలోని పలువురు అధికారులు పలుకుబడి అనే మందు వాడుతుండడంతో గోదావరి జిల్లాల్లో వాడ వాడ లా వయాగ్రా దొరుకుతున్నా చలనం లేదు.
ఎక్కడపడితే అక్కడ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1500 వరకూ మెడికల్ షాపులు ఉన్నాయి. వాటిలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం నగరాల్లో 500 ఉండగా.. గ్రామాలు, మండల కేంద్రాల్లో వెయ్యి వరకూ ఉంటాయి. చాలా దుకాణాల్లో ప్రిస్ర్కిప్షన్ లేకుండానే అన్ని మం దులనూ అమ్మేస్తుంటారు.నిద్ర మాత్రలు, యాం టి బయోటిక్స్ ఇలా అన్నీ దొరికేస్తుం టాయి. గ్రామాల్లో ఈ విధమైన వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ఇదే అదనపుగా ఒక యువకుడు వయాగ్రా, అబార్షన్ కిట్లు, అబార్షన్ ట్యాబెట్ల వ్యాపారాన్ని తెరచాటుగా విస్తరించుకున్నాడు. గ్రామాల్లో అబార్షన్ కిట్లు విచ్చలవిడిగా దొరుకుతుండ డంతో ఎలాంటి అనుమతులు, అనుభవం లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు.
చూసీచూడనట్టు..
ఉమ్మడి జిల్లా పరిధిలో రాజమండ్రి అర్బన్, రూరల్, కొవ్వూరు, తుని, కాకినాడ రూరల్, అర్బన్, అమలాపురంలలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరికి జిల్లా అధికారిగా ఏడీ ఉంటారు. వయాగ్రా అంశం గుప్పుమన్న తర్వాత పొడి పొడిగా తనిఖీలు చేశారు. కానీ ఏం జరిగిందో తెలియరాలేదు.దీనిపై ఉమ్మడి తూర్పు గోదావరి ఔషధ నియంత్రణ శాఖ ఏడీని వివరణ కోరడానికి రెండు రోజులపాటు ప్రయత్నించినా ఫోనులో అందుబాటులోకి రాలేదు. మెడికల్ షాపుల ద్వారా కొంత మొత్తం ముడు తుండ డంతో కొందరు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మందుల విచ్చలవిడి విక్రయాలపై గత ఏడాది అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ద్వారా హెచ్చరించింది. మందుల విక్రయాలు ఇష్టాను సారం జరుగుతున్నాయని, వైద్యులు కూడా అనవసరమైన మందులను యథాలాపంగా రాసేస్తున్నారని పేర్కొంది.
అసలేంటి వయాగ్రా?
వయాగ్రా అనేది తయారీ కంపెనీ పేరు. ఆ మాత్రల్లో ‘సిల్లినాఫిల్ సిట్రేట్’ అనే మెడిసిన్ ఉం టుంది. అన్ని మందుల మాదిరిగానే దీనినీ మెడి కల్ షాపుల్లో విక్రయించవచ్చు. కానీ వైద్యుల ప్రిస్కిప్షన్, పర్యవేక్షణ కచ్చితంగా ఉం డాలి. ఈ మెడిసిన్‌ని లైంగిక పటుత్వం, కలయిక సమ యం పెరుగుదలకు వాడతారు. పల్మనరీ హైపర్ టెన్షన్‌కి ఒక్కోసారి వైద్యులు సూచిస్తారు. బీపీ ఉన్న వారు ఈ మెడిసిన్ వాడితే నరాలు పగిలి పోయి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఈ ట్యాబ్లెట్లు 4.50 సంఖ్యా ప్యాక్‌లో దొరుకుతాయి. వీటిని ఆన్‌లైన్‌లో కూడా విచ్చలవిడిగా అమ్మేస్తు న్నారు.వీటికి ఉమ్మడి జిల్లాలో యువత అల వాటు పడడంతో వ్యాపారం జోరుగా సాగు తోం ది.రాజమండ్రిలో 2017-18లో వయాగ్రాకు సం బంధించి కేసులు పెట్టారు. అవి ఇప్పటికీ నడు స్తున్నాయి.కొన్ని నెలల కిందట దానవాయి పేట లోని ఓ పెద్ద మెడికల్ షాపులో కాలం చెల్లిన మందులు విక్రయించగా ఓ వారం రోజుల పాటు ఆ షాపును మూతవేయించారు. తర్వాత ‘ఏ జరిగిందో’ ఎవరికీ తెలియదు. ఏదే మైనా చాలామటుకు దుకాణం స్థాయిలోనే సర్దు బాటు అయిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉమ్మ డి జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ సీరియస్ గా దృష్టి సారించాలనే వాదన వినవస్తోంది.
మందుల తీరు మాయ
గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటీవ్స్‌ని నియమించుకుని వ్యాపారం చేసేవి.అయితే ఇప్పుడు కొత్త ఒరవడి వచ్చింది. హరియాణాలోని బడ్డి అనే ఓ ప్రాంతంలో, అలాగే గుజరాత్‌లోని పలు చోట్ల మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. మెడికల్ రిప్రజెంటెటీవ్‌లుగా అనుభవం వచ్చిన తర్వాత కొందరు డాక్టర్ల వద్ద ఆర్డర్లు తీసుకొని సొంతంగా ఆ ప్రాంతాలకు వెళ్లి పెద్ద మొత్తంలో మందులు కొనుగోలు చేసి తీసుకు రావడం మొదలైంది.దీనిని ప్రొపగాండా కం డిస్ట్రిబ్యూషన్ (పీసీడీ) అంటారు. ఆ మందులపై సొంతగా పేరు వేయించుకోవచ్చు. సాధారణంగా మం దులు తయారీ నుంచి వినియోగదారుడి చేతి కొచ్చేసరికి 1500 శాతం ధర పెరు గుతుంది. ఇప్పుడు వయాగ్రా, అబార్షన్ కిట్లను తీసుకొచ్చి దందా సాగిస్తున్నారని తెలుస్తోంది.
డొంక కదిలిందిలా..
గణేశ్ కుమార్ అనే యువకుడు రాజమహేం ద్రవరంలోని ఓ పెద్ద కంపెనీ ఫార్మసీలో కొన్నా ళ్లు పనిచేశాడు. ఇదిలా ఉండగా వేరే రాష్ట్రానికి చెందిన వారితో పరిచయం ఏర్పడింది. కొన్ని ఫార్మసీ కంపెనీలు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్‌ని అక్రమంగా పెద్ద మొత్తంలో అమ్ముకోడానికి ఉద్యోగులను నియమించుకుంటాయి. ఈ మా దిరిగానే గణేశ్‌కి మార్గం దొరింది. దీంతో అతడు వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. కొన్నేళ్లుగా వయాగ్రా ట్యాబ్లెట్లు, గర్భవిచ్ఛిత్తి మందులు, కిట్లు తెచ్చి మెడికల్ షాపులకు విక్రయిస్తున్నా డు. జంగారెడ్డిగూడెంలోని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున ఆ మందులు పట్టుబట్టాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరిలో కూడా ఆ అక్రమ వ్యాపారం విక్రయించిందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ డ్రగ్స్ అధికారులు మేలుకోలేదు.
నాడు కలెక్టర్ ఆదేశించినా..
ఉమ్మడి తూర్పులోని డ్రగ్స్ శాఖ పనితీరుకు దగ్గు మందుల అంశం మరో ఉదాహరణ. గం జాయి వంటివి కట్టడి చేసినా యువత మత్తు లో జోగుతుండడంపై తూర్పు గోదావరి పోలీ సులకు అనుమానం వచ్చింది. వెంటనే నిఘా పెట్టగా..దగ్గు మందులను ఎక్కువ మోతాదు లో తాగేస్తున్నారని తెలిసింది. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా లభ్యమవుతుండ డం పై నివ్వెరపోయారు. మెడికల్ షాపులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.కానీ తర్వాత ఫలితం ఏమిటో డ్రగ్స్ అధికారులు బయటకు పొక్కనీయలేదు.
Updated Date - Jul 11 , 2025 | 01:23 AM