ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాస్టర్‌ ప్రవీణ్‌ది ప్రమాదం కాదు.. హత్యే

ABN, Publish Date - Apr 16 , 2025 | 01:08 AM

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 15(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ప్రమాదం కాదని.. హత్యేనని.. పోలీసులు ఫేక్‌ వీడియోస్‌ లీక్‌ చేసి వాటినే ఆధారాలుగా చూపించి రోడ్డు ప్రమాదంగా మలిచారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గా

సమావేశంలో మాట్లాడుతున్న హర్షకుమార్‌

ఫేక్‌ వీడియోలు సృష్టించిన పోలీసులు : మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపణ

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 15(ఆంధ్ర జ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ప్రమాదం కాదని.. హత్యేనని.. పోలీసులు ఫేక్‌ వీడియోస్‌ లీక్‌ చేసి వాటినే ఆధారాలుగా చూపించి రోడ్డు ప్రమాదంగా మలిచారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజీవ్‌ గా ంధీ విద్యాసంస్థలో మంగళవారం ఆయన విలే కర్లతో మాట్లాడారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మత మార్చిడి చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2022 డిసెంబర్‌ 15న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని, ఈ నెల 16న సుప్రీంకోర్టు బెంచ్‌ వద్ద ప్రవీణ్‌ పగడాల తన వాదన వినిపించి ఆఽధారాలు సమర్పించాల్సిఉందన్నారు. బీజేపీ స్పోక్స్‌ పర్సన్‌ అశ్విన్‌కుమార్‌ ఉపాధ్యాయ, అతని అడ్వకేట్‌ అశ్విని దుబేలు ప్రవీణ్‌ పగడాల విషయంలో ప్లాన్‌ చేసి ఉంటారని ఆరోపించారు. ఈ నెల 19న సాయంత్రం కొంతమూరులో ప్రవీణ్‌కు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగిస్తామన్నారు.ప్రవీణ్‌ పగడాలది హత్య అని నమ్మేవాళ్లంతా అక్కడకు రావాలని సూచించారు. ఈస్ట్రర్‌ పండుగ రోజు క్రైస్తవ బరియల్‌ గ్రౌండ్‌లో ప్రవీణ్‌ పగడాల ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలని ఆయన కోరారు.సమావేశంలో జీవీ శ్రీరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:08 AM