ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రారంభించేదెవరు!

ABN, Publish Date - Jul 27 , 2025 | 01:32 AM

గత వైసీపీ ప్రభుత్వం ఉత్తు త్తి పనులకు అంతెత్తు శిలాఫలకాలు వేసి ఆడంబరంగా ప్రారంభోత్సవాలు చేయడం జనం చూశారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రికి చేరుతున్న సామగ్రి

రేపు ప్రారంభమని వినికిడి

రాజమహేంద్రవరం, జూలై 26 (ఆం ధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఉత్తు త్తి పనులకు అంతెత్తు శిలాఫలకాలు వేసి ఆడంబరంగా ప్రారంభోత్సవాలు చేయడం జనం చూశారు. నిధుల్లేక పోయినా కార్యక్ర మాలు మాత్రం అట్టహాసంగా ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వంలో తాము చేసిన మంచినీ చెప్పుకోడానికి నాయకులకు సమ యం లేనట్లుగా కనిపిస్తోంది. అది కేంద్రం పరిధి అని ఒకరు, రాష్ట్రం పరిధి అని మరొ కరు మొత్తానికి అవగాహనా లేమితో చేసిన మేలును రెండింటికీ చెడ్డ రేవడిలా చేస్తున్నా రు. రాజమహేంద్రవరంలో 6 ఎకరాల్లో 14 వేల చదరపు మీటర్లలో రూ.56 కోట్లతో 12 డిస్పెన్సరీల పరిధిలో కార్మికులకు సేవలం దించేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రిని అధునాత నంగా నిర్మించారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభు త్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో నత్తనడక తప్ప లేదు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేయ డంతో మొత్తానికి నిర్మాణం పూర్తయింది. ఈ నెల 9న కేంద్రం ఆధీనంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి ంది.అప్పటి నుంచీ పాత ఆస్పతి నుంచి కొత్త భవనంలోకి నెమ్మదిగా సామగ్రిని తరలిస్తు న్నారు. సోమవారం నుంచి సేవలను కొత్త భవనంలో ప్రారంభించే అవకాశం కనిపి స్తోంది. అయితే ఇంతా చేసి నిశ్శబ్దంగా ప్రారంభం కావడంపై విమర్శలు వినవస్తు న్నాయి.ఊళ్లో ఎంపీ పురందేశ్వరి,పక్కనే కార్మి క మంత్రి సుభాశ్‌,ఇక్కడే జిల్లా మంత్రి దుర్గేశ్‌ ఉన్నా ఆస్పత్రి అనాథలా సేవ ల ను ఆరంభించాల్సి రావడంపై పలువురు మండి పడుతున్నారు.చేసిన మేలు చెప్పుకోవ డంలో ఎందుకింత అలసత్వమని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 01:32 AM