భక్తులకు మెరుగైన సేవలందించాలి
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:58 AM
అన్నవరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో సేవలందించేందుకు విచ్చేసే సేవాదల్ సభ్యు ల సేవలను వినియోగించుకుని వారి ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ సూ చించారు. శుక్రవారం కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆగమ పాఠశాల, ఇతర నిర్మాణాలను పరిశీలించి కమాండ్ కంట్రోల్‌రూం నందు అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం
సేవాదల్ ద్వారా వచ్చే సేవకులను వినియోగించుకోవాలి
ఖర్చు చేసే ప్రతిరూపాయి సౌకర్యాల కల్పనకు ఉపయోగపడాలి
దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్
అన్నవరం దేవస్థానంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష
అన్నవరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో సేవలందించేందుకు విచ్చేసే సేవాదల్ సభ్యు ల సేవలను వినియోగించుకుని వారి ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ సూ చించారు. శుక్రవారం కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆగమ పాఠశాల, ఇతర నిర్మాణాలను పరిశీలించి కమాండ్ కంట్రోల్‌రూం నందు అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది జీతాల కోసం పనిచేస్తుండగా సేవాదల్ సభ్యులు అవేమి ఆశించకుండా సేవలందిస్తున్నారని వారికి సౌకర్యాల కల్పన విషయంలో రాజీపడవద్దని సూచించారు. ఇంజ నీరింగ్ విభాగం ద్వారా ఖర్చు చేసే ప్రతిరూపాయి భక్తుల సౌకర్యాల కల్పనకు ఉపయోగపడేవిధంగా ఖర్చుపెట్టాలన్నారు. ఆగమ పాఠశాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన విద్యార్థులు తమ ఆహార పదార్థాలు స్వీకరించిన ప్లేట్‌లు, గ్లాసులు వేడినీటితో శుభ్రంచేసేందుకు వీలుగా గ్రీజర్‌ను ఏర్పాటు చేయాలని, అదేవిధం గా అదనంగా మరో మనిషిని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న మెయిన్ క్యాంటీన్ లైసెన్స్ హక్కుకు ఎవరూ రానందున దానిని డా ర్మెటరీగా వినియోగించుకోవాలని సూచించారు. సీఆర్వో కార్యాలయం వద్ద నూతనంగా భక్తులకు అవసమైన తినుబండారాలు విక్రయించుకునేందుకు క్యాంటీన్ ఏర్పాటుచేయాలన్నారు. సిబ్బంది అంతా ఎస్‌ఓపీ నిబంధనలు పాటించాలని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెంటల్రైజ్డ్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఈనెల 15 కల్లా ఫై నల్ అవుతుందని ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు పీఎఫ్ సొ మ్ముల విషయమై కమిషనర్‌ను కలవగా కార్మికులు ప్రతినెలా తమ సొమ్ములు జమ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు. వర్షపు నీరు వృథాగా పోకుండా లక్షలీటర్ల నీటిని నిల్వచేసేందుకు ఏర్పాటుచేసిన అల్యూమినియం ట్యాంక్‌ను పరిశీలించారు. సమీక్షలో దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్, ఆర్జేసీ త్రినాధరావు, లోవ దేవస్థానం ఈవో విశ్వనాధరాజు పాల్గొన్నారు. అంతకముందు సత్యదేవుడిని దర్శి ంచుకున్న ఆయనకు ఆలయ ఈవో, చైర్మన్‌లు ఘనస్వాగతం పలకగా వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.
Updated Date - Aug 02 , 2025 | 12:58 AM