నాయకా..కదలాలిక!
ABN, Publish Date - May 26 , 2025 | 01:01 AM
గవర్నమెంట్ ఐటీఐలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి అదే ప్రాంగణంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో పనిచేసి.. తిరిగి మళ్లీ ఐటీఐ కార్యాలయానికి బదిలీపై వచ్చారు.
ఏళ్లగా ఒకే చోట తిష్ఠ
పదేళ్లయినా సీటు వీడని వైనం
కదిలేందుకు అనాసక్తత
ఉద్యోగ సంఘాల్లో చేరిక
పలు ఆఫీసుల్లో ఇదే పరిస్థితి
ప్రభుత్వ ఉత్తర్వులతో షాక్
బదిలీలకు ఐదు రోజులే గడువు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
గవర్నమెంట్ ఐటీఐలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి అదే ప్రాంగణంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో పనిచేసి.. తిరిగి మళ్లీ ఐటీఐ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. తాజాగా యూనియన్‌లో చేరి మరో నాలుగేళ్లు ఇక్కడే పనిచేసేందుకు స్కెచ్ వేశారు. ఇలా దాదాపు అన్ని విభాగాల్లోని నాయకులు ఈ పాత చింతకాయలాంటి జీవోను పట్టుకుని మరి కొన్నేళ్ల పాటు కార్యాలయంలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సాధారణ బదిలీల్లో సర్వీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు మినహాయింపు ఇచ్చే ముందు సర్టిఫికెట్ల వాస్తవికత ధ్రువీకరించుకోవాలని ఆదేశించింది.ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో పారదర్శకత కొరవడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. కొన్ని శాఖల్లో కుర్చీలను వదిలేందుకు ఇష్టపడని కొందరు ఉద్యోగులు ’పాత’దారులు వెతుక్కుంటున్నారు.ఎలాగైనా అదే శాఖలో మళ్లీ తిష్ఠవేయాలని ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభు త్వ తాజా ఉత్తర్వులను, జీవోలను పక్కన పెట్టి కాలం చెల్లిన పాత జీవోలను తెరపైకి తెస్తున్నా రు. ఏళ్ల తరబడి సీట్లకు అతుక్కుపోయి రాజకీ యం చేస్తున్న కొందరు..ఉద్యోగ సంఘాల నా యకులమనే పేరుతో బదిలీలకు బ్రేక్‌లు వేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఉద్యోగుల ప్రయత్నాలు..
ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఒకే స్టేషన్‌లో పనిచేసిన ప్రతి ఉద్యోగిని కచ్చితంగా బదిలీ చేయాలని సూచించింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 500 నుంచి 700 మంది బదిలీ కావొ చ్చని అంచనా.ఎందుకంటే గతేడాది సెప్టెంబరు లో సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బదిలీల ఏళ్ల తరబడి పాతు కుపోయిన వారు కదలాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని విభాగాల్లో దాదాపు ఐదేళ్లు దాటిన వారే కాదు.. 7-10 ఏళ్లకు పైగా ఒకే స్టేషన్లో తిష్ఠవేసి రాజకీయాలు చేస్తున్న వారూ ఉన్నారు. ము ఖ్యంగా ఉద్యోగ సంఘాల పేరుతో తమ బదిలీలను నిలుపుదల చేసుకుంటూ కొందరు వస్తున్నారు. సంఘాల్లో ఉండే నాయకులకు ఐదేళ్లతో పాటు మరో నాలుగేళ్లు కలిపి సుమారు తొమ్మిదేళ్ల పాటు ఒకే స్టేషన్లో పనిచేసే అవ కాశం ఉం ది. ప్రస్తుతం కొన్ని శాఖల్లోని ఉద్యోగులు కొందరు సంఘ నేత లుగా అవతారమెత్తి బదిలీ కా కుండా చూసుకుంటున్నారు.ఈ మేరకు కొందరు ఉద్యోగులు రెండు,మూడు నెలల కిందట డబ్బు లు కట్టి ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా చేరిపోయారు. ఎగ్జిక్యూటివ్ పదవులు దక్కించుకున్నారు.తా ము యూనియన్లలో ఉన్నామని తమ కు బదిలీలు వర్తించబోవని తప్పించుకుంటున్నారు. ఒకే డిపార్ట్‌మెంట్‌లో ఉండే ప్రభుత్వ ఐటీఐ, టెక్నికల్ ఆర్‌జేడీ,జిల్లా ఉపాధి కార్యాలయాల్లోని పలువు రు ఉద్యోగులు సీట్లకు అతుక్కుపోయేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.2012 నాటి సర్క్యులర్ మెమోను చూపించి బదిలీ నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
స్వీటు అందుకే..
చాలా మంది ఉద్యోగులు బదిలీ అయి వెళ్లడానికి అంగీకరించరు.. ఏదో రకంగా కుర్చీకి అతుక్కుపోవడానికే చూస్తారు.. ఎందుకంటే ఆ సీటుకు ఉన్న డిమాండ్ అటువంటిది.. బాగా ఆదాయవనరు ఉన్న సీటుకు అంతా ఇంతా డిమాండ్ కాదు.. రూ.లక్షలు పోసి ఆ సీటు సంపాదిస్తారు. అటువంటి సీటును కాపాడుకోవడానికి ఉద్యోగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఖజానా తదితర విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదే జరు గుతోంది.. డిమాండ్ ఉన్న సీటును కాపాడు కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అటువంటి సీట్లపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశమూ ఉంటుంది..
ఈ నెల 31 వరకు గడువు..
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2025 మే 31 నాటికి ఒక స్టేషన్లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని సూచించింది.ఒక స్టేషన్లో (అంటే కా ర్యాలయం లేదా సంస్థ కాదు. వాస్తవంగా పనిచేసే ప్రదేశం(నగరం, పట్టణం, గ్రామం) ఐదేళ్ల్లు పూర్తి చేసిన వారే కాకుండా ఇతర ఉద్యో గులు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులు. అటువంటి ఉద్యోగులందరికీ ప్రాధాన్యమివ్వాలి. ఇందులో ఆయా ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన వారికి కొంత వెసులుబాటు ఉంది. వారు అద నంగా మరో నాలుగేళ్లు అంటే తొమ్మిదేళ్ల పాటు వారు ఒకే స్టేషన్లో పనిచేయవచ్చు. తొమ్మిదేళ్ల పూర్తయ్యాక కచ్చితంగా బదిలీ చేయాలి.
సీఎస్ చెక్ పెట్టారిలా..
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ విడుదల చేసిన సర్క్యులర్ మెమో ఇలాంటి నేతల ఆటలకు చెక్ పెట్టినట్టయ్యింది. గుర్తింపు పొం దిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు వర్తింపజేసే సాధారణ బదిలీ మినహాయింపు సౌకర్యాన్ని గతంలో దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధిపతులు, కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్ల అసోసియేషన్ల నుంచి నిర్ణీత పత్రాలను పొందాలని ప్రభుత్వం సూచించింది. సాధారణ బదిలీల్లో సర్వీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు మినహాయింపు ఇచ్చే ముందు సర్టిఫికెట్ల వాస్తవికతను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని ఆదేశించింది.మినహాయింపు కోరుతున్న ఆఫీస్ బేరర్ పదవి, పదవీకాలం తదితర విషయాలు అసోసియేషన్ ఉపచట్టాల్లో కవర్ చేసి ఉన్నా యో లేదో పరిశీలించాలని,వారి పేరు అసోసియేషన్ ఓటర్ల జాబితాలో ఉందో లేదో తదితర అన్ని విషయాలను ధ్రువీకరించుకున్న తర్వాత మాత్రమే సాధారణ బదిలీల్లో మినహాయింపు వర్తింపజేయాలని సూచించారు. ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విభాగాధిపతులు, కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - May 26 , 2025 | 01:01 AM