ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:27 AM

అత్యవ సర మందులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది పనితీరు, ఇన్‌పేషెంట్స్‌, అవుట్‌పేషెంట్స్‌ వివరాలు తెలుసుకుని సంతృ ప్తి వ్యక్తంచేశారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు
  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు.. కోరుకొండ పీహెచ్‌సీ ఆకస్మిక సందర్శన

కోరుకొండ, జూలై 12(ఆంధ్రజ్యోతి): అత్యవ సర మందులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది పనితీరు, ఇన్‌పేషెంట్స్‌, అవుట్‌పేషెంట్స్‌ వివరాలు తెలుసుకుని సంతృ ప్తి వ్యక్తంచేశారు. ప్రతి రోజు అవుట్‌పేషెంట్స్‌ 100 నుంచి 150 మంది వైద్యం పొందుతున్నారని ఆసుపత్రి వైద్యు డు డాక్టర్‌ జ్ఞాన చంద్రరావు తెలిపారు. ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థి యేటర్‌, పేషెంట్స్‌ వార్డు, మందులు గది, రిసెప్షన్‌, ల్యాబ్‌ రూంలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కుటుంబ సంక్షేమ ఆరోగ్య కా ర్యక్రమాలు 100శాతం లక్ష్యాలు సా ధించాలని సూచించారు. పీఎంవీవీవై, పీఎంఎస్‌ ఎంఏ, యూఐపీ, ఎన్‌సీడీసీడీ, ఏబీహెచ్‌ఏ ఐడీ లు, టీబీ ముక్తి భారత్‌, ఎన్‌ఎల్‌ఈపీ, అంటు వ్యాధుల నివారణ, జింక్‌ కార్నర్‌ కార్యక్రమాల రికార్డులను పరిశీలించి ముఖ్య సూచనలు చేశా రు. గర్భిణులు, బాలింతలు సేవలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట బొర్రే రాజు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:28 AM