తూరుపు నుంచే..చంద్రూదయం!
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:44 AM
024 జూన్ 12.. ఉదయం 11.27 గంటలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి... వైసీపీ అస్తవ్యస్తం, అంధకారం చేసిన రాష్ట్రంలో తన అనుభవంతో వెలుగులు నింపడానికి అధి కార పగ్గాలు చేపట్టిన ఘడియలు.
మహానాడులోనే మినీ మేనిఫెస్టో
51 రోజులు జైలులోనే బాబు
సెంట్రల్ జైలులో పొత్తు పొడుపు
బాబుతో ములాఖత్.. పవన్ ప్రకటన
భువనేశ్వరి సత్యమేవ జయతే
రాజమండ్రిలోనే జేఏసీ తొలి భేటీ
ఊతంగా నిలిచిన జిల్లావాసులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
2024 జూన్ 12.. ఉదయం 11.27 గంటలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి... వైసీపీ అస్తవ్యస్తం, అంధకారం చేసిన రాష్ట్రంలో తన అనుభవంతో వెలుగులు నింపడానికి అధి కార పగ్గాలు చేపట్టిన ఘడియలు. రాష్ట్రంలో నవశకం..జనం కళ్లలో ఆనందం పునః ప్రారం భమైన రోజు.. చెడు తాత్కాలికంగా విర్ర వీగవచ్చు గానీ అంతిమంగా మంచిదే పైచేయి అని మరోసారి చరిత్రలో నిలిచిన సాక్ష్యం. ఐదేళ్ల నరకం నుంచి రాష్ట్రం బయటపడే దిశగా ‘చం ద్రూదయాని’కి అంకురార్పణ మన ‘తూర్పు’లోనే జరగడం ఉమ్మడి తూర్పు ప్రజ లకు గర్వకారణం. దుష్టపాలనను అంత మొం దించడానికి పడిన ప్రతి అడుగునకు రాజమ హేంద్రవరం వేదికైంది. రాష్ట్ర చరిత్రను తిరగరా సిన అదృష్టం గోదావరి తీరం కీర్తి సిగలో మరో కలికితురాయిగా చేరింది.పడి లేచిన ‘చంద్రా’నికి.. తోడున్న ‘పవనా’నికి ఊతమై నిలిచింది.
ముహూర్తం..మహానాడు
రాష్ట్రంలోని అసురపాలన అంతం కావడానికి మహానాడు రోజునే ముహూర్తం రాట పడిం ది.రాజమహేంద్రవరంలో 2023 మే నెల 27, 28న జరిగిన మహానాడు విజయవంత మైంది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఆరు ప్రధాన హామీలను ప్రజలతో చంద్రన్న పం చుకున్నారు. మహిళలపై వరాల జల్లు కురి పించారు.ఆనాటి నుంచీ వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది. అరచేతితో చంద్రూ దయాన్ని ఆపలేమనే నిజాన్ని మరిచి.. చివరికి చంద్రబాబును జైలుకు పంపించా రు. ‘ప్రజలతో నేను.. నాతో ప్రజలు’ అని గట్టిగా నమ్మే చంద్రబాబు జనం కోసం ఇబ్బ ందులను తట్టుకున్నారు. 2023 సెప్టెంబరు 14న చంద్రబాబును ములాఖత్‌లో కలిసి బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ ‘టీడీపీ- జనసేన’ కలిసి నడుస్తాయని ప్రకటించారు.
పొత్తు పొడిచిన తర్వాత..
2023 అక్టోబరు 24 మూడో శుభపరి ణామా నికి గోదావరి తీరం వేదికైంది. రాష్ట్ర ప్రజల భవిత మళ్లీ గాడిలో పడే దిశగా రాజ కీ యంగా అత్యంత కీలకమైన సభ జరిగింది. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమిటీ(జేఏసీ) సమావేశం ఇక్కడే నిర్వహిం చారు.ఆ సమావేశం సూపర్ సక్సెస్ అయ్యిం ది. న్యాయం కోరుతూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ సభ నిర్వ హించారు.ఆ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు అండగా నిలిచారు. అప్పు డు కూడా వైసీపీ నాయకుల వెకిలి చేష్టలకు అడ్డు లేకుండా పోయింది.
నిరంతర శ్రామికుడి కోసం
ఒక్క చాన్స్ అని గద్దెనెక్కి సాగించిన నియంతపాలన అంతానికి జనం ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ సమయంలో జగన్ పైశాచిక ఆనందం చిందులు వేసినా.. జనంలో మాత్రం ఆగ్రహం పెల్లుబి కింది. మహానాడు విజయం, టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించడం, జేఏసీ భేటీ సక్సెస్.. ఇలా రాష్ట్రంలో మళ్లీ వెలుగులు నిండడానికి మంచి శకునాలే కనిపించినా నిరం తర శ్రామికుడి రాక కోసం జనం ఎదురు చూశారు. జైలు నుంచి విడుదలై వచ్చే ఘడియ కోసం అభిమానులు రోజులు లెక్క పెట్టుకున్నారు. 53 రోజుల అక్రమ కారాగార వాసం నుంచి మళ్లీ జనాల్లోకి వచ్చిన చంద్ర బాబు విజయవాడ వెళ్లే వరకూ కూడా అడు గడుగునా జనం నీరాజనం పట్టారు. ఆయన జైలు నుంచి సాయంత్రం విడుదలైతే విజయ వాడ చేరేసరికి మరుసటి రోజు తెల్లవారు జా ము అయిందంటే..ఆయనపై జనానికి ఉన్న నమ్మకానికి అంతకంటే రుజువేం కావాలి.
మళ్లీ పుష్కరాలకు ఆయనే..
గత పుష్కరాలకు చంద్రబాబు ఏకంగా 12 రోజులు ముఖ్యమంత్రి హోదాలో రాజమ హేంద్ర వరంలోనే బస చేశారు. కేబినెట్ సమా వేశం సైతం ఇక్కడే నిర్వహించారు. గోదావరి ఘాట్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చా రు. దేశంలోనే పెద్దదైనా కోటిలింగాల ఘా ట్‌ను అప్పుడు నిర్మించుకున్నాం. ఆయనే స్వ యంగా లోటు పాట్లను తెలుసుకుని తక్షణ పరి ష్కారం చూపిస్తూ పుష్కరాలను ఔరా అని పించారు. బ్రిటిష్ వాళ్లు నాలుక తిరగక చారిత్రక నగ రానికి మార్చేసిన పేరును మళ్లీ తీసుకొచ్చారు. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేస్తూ ఇక్కడే చంద్రబాబు ప్రకటన చేశారు. 2027లో మళ్లీ ఆయన చేతి తోనే పుష్కరాల క్రతువును గోదారమ్మ నిర్వ హించుకోనుంది. ఈ సారి మరింత ఘనంగా చేయాలనే తలంపుతో సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.
Updated Date - Jun 11 , 2025 | 12:44 AM