ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వస్తున్నాయ్‌.. ఈ-బస్‌లు!

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:19 AM

న్నాళ్లకెన్నాళ్లకు..ఆర్టీసీలో కొత్త బస్సు లను చూసి ఎన్నేళ్లయిందో.. చాలా కాలంగా డొక్కు బస్సులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త బస్సులకు చోటు లేదన్నట్టు పాత బస్సు లనే అరగదీశారు..అయితే ప్రభుత్వం మారింది.. కొత్త బస్సులకు మార్గం సుగమమైంది.

ఈ-బస్‌లు

కాకినాడ,రాజమండ్రికి బస్‌లు

100 బస్‌లు తెచ్చే యోచన

కోనసీమకు రెండో విడత

చార్జింగ్‌ పోర్టుల నిర్మాణం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఆర్టీసీలో కొత్త బస్సు లను చూసి ఎన్నేళ్లయిందో.. చాలా కాలంగా డొక్కు బస్సులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త బస్సులకు చోటు లేదన్నట్టు పాత బస్సు లనే అరగదీశారు..అయితే ప్రభుత్వం మారింది.. కొత్త బస్సులకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్‌ బస్సులు (ఈ వీ) పరుగులు పెట్టనున్నాయి. ఇప్ప టికే బస్సులు తిరగాల్సిన రూట్ల ను ప్రతిపాదించారు.ఎలక్ట్రికల్‌ బస్సు లపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

2 జిల్లాలు.. 100 బస్‌లు..

కేంద్ర ప్రభుత్వ పథకంలో రాజ మండ్రికి 50, కాకినాడకు 50 బస్సులు ఆరు నెలల్లో రానున్నాయి. వీటిని ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతారు. ఇప్పుడు ప్రైవేటు ఆర్టీసీ బస్సుల మాదిరిగానే..డ్రైవరు, నిర్వహణ ఆయా యజమానులు చూసుకుంటారు. చార్జిం గ్‌ పోర్టులకు అవసరమైన స్థలం, డ్రైవర్లకు రెస్ట్‌ రూంల వంటివి ఆర్టీసీ కల్పిస్తుంది. చార్జీలు ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటాయి. ఒక్కో బస్టాండ్‌లో దాదాపు 10 చార్జింగ్‌ పోర్టులను ఏర్పాటు చేస్తుండగా..వాటికి సబ్‌-స్టేషన్ల నుంచి నేరుగా ప్రత్యేక లైను వేస్తున్నారు. ఏసీ బస్సులు కాబట్టి చార్జీలు ప్రస్తుతం కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా డిపోలకు కేటాయించే బస్సుల్లో 12 మీటర్ల పొడవుతో 32, 9 మీటర్ల పొడవుతో 18 బస్సులు ఉండ నున్నాయి. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీ మల్లో వెయ్యి బస్సుల వరకూ ఉండగా 40 శాతం అద్దె బస్సులు ఉన్నాయి. విద్యుత్‌ బస్సు లు వచ్చిన తర్వాత మొరాయి స్తున్న బస్సులను పక్కన పెట్టే ఆలోచనలో ఆర్టీసీ ఉంది. డీజిల్‌తో నడు స్తున్న బస్సులకు కిలోమీటరుకు రూ.8 నుంచి రూ.20 వరకూ ఉన్న నిర్వహణ ఖర్చు లు ఈవీలతో తగ్గుతాయి.

కేంద్రం పథకంలో బస్‌లు..

కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఈ-బస్‌ సేవా పథకంలో కన్వర్జన్సీ ఎనర్జీ సర్వీసెస్‌ (సీఈఎస్‌)తో కలిపి మొదటి దశలో రాజ మహేంద్రవరం, కాకినాడకు 50 చొప్పున, అమలాపురానికి రెండో దశ లో ఈవీలు రానున్నాయి. ఆయా డిపోల్లో ఇప్పటికే చార్జింగ్‌ పోర్టులకు స్థలాలను కేటాయించారు. పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ బస్సులు కావడంతో వాయు, శబ్ద కాలుష్యం మాటే ఉండదు. గ్రా మీణ ప్రజలు కూడా పల్లె వెలుగు ఏసీ బస్సుల్లో ఎంచక్కా మంచి ప్రయాణ అను భూతిని పొందవచ్చు. మొరాయిస్తున్న బస్సు లతో కుస్తీలు పడుతున్న అధికారులకు, ఒళ్లు నొప్పుల నుంచి ప్రయా ణికులకు ఉపశ మనం కలగనుంది. ఇకపై ఆర్టీసీలో ఈ-బ స్సులే కొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ-బస్సులకు కేంద్రం రూ.35 లక్షలు నేరుగా రాయితీ ఇస్తోంది.

రూట్లు ఇవే!

కాకినాడ డిపోకు సంబంధించి కాకినాడ- రాజమండ్రి నాన్‌స్టాప్‌, అమలాపురం, రాజమండ్రి వయా ద్వార పూడి, విశాఖపట్నం, విజయవాడ, బిక్కవోలు.. రాజమండ్రి డిపోకు సంబంధించి కాకినాడ నాన్‌ స్టాప్‌, కాకినాడ(వయా బిక్కవోలు, రాజానగరం), విజ యవాడ, అమలాపురం, గోకవరం, గోకవరం సిం గిల్‌స్టాప్‌ రూట్లను ప్రతిపాదించారు.

ప్రయాణం సుఖవంతమే కానీ..

ఎలక్ట్రికల్‌ బస్సులను డీజిల్‌ బస్సుల మాది రిగా తిప్పడానికి వీలు పడకపోవచ్చు. గోతుల రోడ్లలో వీటిని తిప్పతే మూణ్ణాళ్ల ముచ్చట కిం దే పరిస్థితి ఉంటుంది.ఒకసారి చార్జింగ్‌ చేయ డానికి 45 నిమిషాలు పడుతుంది. ఆ చార్జిం గ్‌తో పరిమిత వేగంలో నడిపితే గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వరకూ పరుగులు పెడుతుంది. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించ డానికి ఇబ్బందే. ఉదాహరణకు విజయవాడ వెళితే అక్కడ మళ్లీ 45 నిమిషాలు చార్జింగ్‌ పెట్టుకొని బయలుదేరాల్సి ఉంటుంది. విశాఖ వెళ్లడానికి ఆలోచించాల్సిందే. ఎలక్ట్రికల్‌ బస్సులను ఆయా ప్రతిపాదిత రూట్లలో ట్ర యల్‌ రన్‌గా కొద్ది రోజులు నడిపితే బాగుం టుందని ప్రయా ణికులు అంటున్నారు. ఈవీ బస్సులు కాలం గడిచే కొద్దీ బ్యాటరీల సామ ర్థ్యం తగ్గడం ఉం టుందని చెబుతున్నారు.

సౌకర్యవంతమైన ప్రయాణం..

ఎలక్ట్రికల్‌ బస్సులు పర్యావరణ హితం. పల్లె వెలుగు బస్సులకు ఏసీ ఉంటే గ్రామీణులు సం తోషిస్తారు. సౌకర్యవంతంగా ప్రయాణా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగానే రూట్లను ప్రతిపాదించడం జరిగింది.

- సత్యనారాయణ మూర్తి, డీపీటీవో

Updated Date - Jun 30 , 2025 | 12:19 AM