ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

300 మూలకే!

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:57 AM

గత ప్రభుత్వంలో ఏంచేసినా మాకేంటి? ముందు వారి జేబునిండితేనే తరువాత పని జరిగేది.. అది ఖజానాకు నష్టమైనా.. జనానికి కష్టమైనా అంతే..

పనిచేయని ఈ ఆటోలు

రూ.12.30 కోట్లు ప్రజాధనం వృథా

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం ఫలితం

నాణ్యత లేని వాహనాల కొనుగోలు

కొన్న తర్వాత అవి ఎక్కడికైనా కదిలితే ఒట్టు

పనిచేయని వాహనాలు.. అన్నీ మూలకు

ఒక్కో ఆటో మరమ్మతుకే రూ.3.50 లక్షలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో ఏంచేసినా మాకేంటి? ముందు వారి జేబునిండితేనే తరువాత పని జరిగేది.. అది ఖజానాకు నష్టమైనా.. జనానికి కష్టమైనా అంతే.. ఉమ్మడి జిల్లాలో ఈ ఆటోలే అందుకు ఉదాహరణ.. ఏదైనా కొత్త వస్తువు కొంటే.. దాని లైఫ్‌ ఎంత ఉంటుంది. కనీసం లేదంటే.. ఎంత చెత్తగా వాడి పడేసినా రెండేళ్లు.. అటువంటిది తీసుకొచ్చిన రోజే పోయాయంటే ఏమనాలి.. అదే మరి.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.. పనికిరాని ఆటోలను తెచ్చిపడేశారని. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సొంత నియోజకవర్గ కేంద్రం పిఠాపురం మునిసిపాలిటీకి 8 ఈ-ఆటోలు కేటాయించారు. ప్రస్తుతం వీటిలో ఒక్కటే పనిచేస్తోంది. ఇక్కడకు వాహనాలు వచ్చిన ఆరు నెలల్లోనే బ్యాటరీలు పూర్తిగా పాడైపోయినట్టు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాసుల కక్కుర్తితో నాసిరకం ఈ-ఆటోలను అంటగట్టిన వైనం ఇప్పుడు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు శిరోభారంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన ఈ-చెత్త ఆటోలు మూలకు చేరాయి. కనీసం వంద కిలోమీటర్లు తిరగకుండానే అనేక వాహనాల బ్యాటరీలు పాడైపోయాయి.ప్రజాధనం రూ.12.30 కోట్లతో నిత్యం చెత్త సేకరణ, తరలింపునకు ఈ ఆటోలు కొను గోలు చేశారు. వీటికి మరమ్మతులు చేయించాలంటే ఒక్కో ఈ ఆటోలో రెండు బ్యాటరీల మార్పునకే రూ.2 లక్షల చొప్పు న ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీ లు, నగర పంచాయతీలు మూలనపడేశాయి. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి సాక్ష్యంగా మారిన వీటి విష యంలో ఏం చేయాలనేది ప్రభుత్వం తేల్చలేకపోతోంది.

నాణ్యతలేని వాహనాలు..

గొల్లప్రోలు నగర పంచాయతీకి ఏడు ఈ ఆటోలు రాగా ఒక్కటీ పనిచేయడం లేదు. పెద్దాపురం, సామర్లకోట మునిసి పాలిటీలకు 16 కేటాయించగా ఒక్కటే పనిచేస్తోంది. తుని మునిసిపాలిటీకి 9 ఇవ్వగా ఒక్కటీ పనిచేయడం లేదు. కాకి నాడ కార్పొరేషన్‌కు 106 కేటాయించగా సగానికిపైగా మూల నపడ్డాయి. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లోను ఇదే పరి స్థితి. మండపేట మునిసిపాలిటీకి మొత్తం 12 కేటాయించగా అన్నింటికీ సమస్యలు ఉన్నాయి. అమలాపురం మునిసిపాలి టీలోనూ వాహనాలు కదలడం లేదు. రామచంద్రపురం ము నిసిపాలిటీలో 8కిగాను 5 పనిచేయడంలేదు. కొవ్వూరు, నిడ దవోలులోను ఇదే పరిస్థితి. ఒకరకంగా నాణ్యత లేని ఈ-ఆటో లను ప్రభుత్వానికి కాంట్రాక్టర్‌ అంటగట్టినట్టు వీటిని చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. మూలనపడ్డ ఈ ఆటోలను ఏం చేయా లనే దానిపై ఇటీవల ప్రభుత్వం ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులతో నివేదికలు రప్పించింది. ఒక్కో ఈ ఆటో మరమ్మతుకు రూ.లక్ష వెరసి రూ.3.50 లక్షలకుపైగానే ఖర్చవుతుందని తెలిపారు. అన్ని వాహనాలను గాడిలో పె ట్టాలంటే కోట్లలో వ్యయం అవుతుందని గుర్తించారు. ఈ మేరకు మునిసిపల్‌ పరిపాలనశాఖ వీటికి మరమ్మతులు చేయించాలని ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. సొంత నిధుల్లేపోవడంతో వాటిని అలా ఓ మూలనే ఉంచేశారు.

Updated Date - Jun 18 , 2025 | 12:57 AM