రెడీఎస్సీ!
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:29 AM
లక్షలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగం ఒక కల..గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఊరించి ఉసూరుమనిపించి ఆ కలకు బ్రేకులు వేసింది..అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు..
ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
అభ్యర్థుల ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లా పోస్టులు 1241
పరీక్షకు 38,617 మంది హాజరు
ఒక్కో పోస్టుకు 50 మంది పోటీ
16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
నెలాఖరుకు టీచర్లకు శిక్షణ
కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
గత వైసీపీ ఐదేళ్లు మాటలే
మరో హామీ నెరవేర్చినట్టే
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
లక్షలాది మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగం ఒక కల..గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఊరించి ఉసూరుమనిపించి ఆ కలకు బ్రేకులు వేసింది..అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.. అన్నట్టుగానే నోటిఫికేషన్ విడుదల చేశారు.. పరీక్షలు నిర్వహించారు.. మరో 13 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. అప్పుడే ఫలితాలకు ఎదురుచూపులు ఆరంభమయ్యాయి.. 1241 పోస్టులకు 60 వేల మంది క్యూలో ఉన్నారు.. ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి.. కూటమి ప్రభుత్వం వచ్చింది..యువత కల తీరుస్తోంది..ఎన్నేళ్ల కలలనో తీరుస్తోంది. ప్రభు త్వ కొలువులు ప్రకటనలు విడుదల చేస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది. దీనిలో భాగం గానే గురువారం పోలీస్ కానిస్టేబుల్ ఫలితా లను విడుద ల చేసిన కూటమి సర్కారు డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించింది. ఈ నెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈ నెల 15లోపు మెగా డీఎస్సీ-2025 ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు ఫలితాలకు ఎదురుచూస్తున్నారు. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన,నెలాఖరుకు కొత్త టీచర్ల పోస్టింగ్‌లు, శిక్షణ అన్నీ చకచకా జరగనున్నాయి.
1241 ఉపాధ్యాయ పోస్టులు
ఉమ్మడి జిల్లాలో 1241 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ 608, పీఈటీలు 210, ఎస్జీటీ 423 పోస్టులు ఉన్నాయి.స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తెలుగు 65, హిందీ 78,ఆంగ్లం 95, గణితం 64, ఫిజికల్ సైన్స్ 71, బయోలాజికల్ సైన్స్ 103, సో షల్ 132, వ్యాయామవిద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్ సైన్స్ 3, బయోలాజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య 1, ఎస్జీటీలు 104 మొత్తం 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్జీటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి. జోన్-2 (ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా)కు సంబంధించి ఏపీ ఆర్‌ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్‌డబ్ల్యూ, బీసీ, సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24తో కలిపి మొత్తం 348 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
63,004 దరఖాస్తులు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డీ ఎస్సీకి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అన్ని మేనేజ్‌మెంట్లకు కలిపి 1241 పోస్టులు ఉండగా63,004 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు సగటున 50 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయుతే ఈ సారి పురుషుల కన్నా మహిళలే దరఖాస్తు నమోదు లో ముందున్నారు.కేటగిరీల వారీగా ఓసీ-5120, బీసీ-ఏ 2810, బీసీ-బీ 6991, బీసీ-సీ 554, బీసీ-డి 3636, బీసీ-ఈ 568, ఎస్సీ గ్రేడ్-1 87, ఎస్సీ గ్రేడ్-2 2572, ఎస్సీ గ్రేడ్-3 10,066,ఎస్టీ 6,213, ఈడబ్ల్యూఎస్ 3,782,దివ్యాంగుల కేటగిరీ నుంచి వీహెచ్ 159, హెచ్‌హెచ్ 36, ఓహెచ్ 847, ఎంఐ ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు.
నాడు ఊరించి..ఉసూరుమనిపించి..
గత వైసీపీ సర్కారు నిరుద్యోగులను నట్టేట ముంచింది. ఉద్యోగాల పేరుతో ఊరించి ఆ ఐదే ళ్లూ ఉసూరుమనిపించింది. ముఖ్యంగా మెగా డీఎస్సీ అంటూ దగా చేసింది. ఆ ఐదే ళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. దీంతో ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఆ ప్రభావం వైసీపీ ఓటమిపైనా ప డింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే..ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించింది.ఈ నెలాఖరుకు ఉపా ధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేయనుంది.
Updated Date - Aug 04 , 2025 | 12:29 AM