ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోస్టులు 1241.. దరఖాస్తులు 63,004

ABN, Publish Date - May 22 , 2025 | 01:10 AM

డీఎస్సీకి దరఖాస్తులు పోటెత్తాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నిరు ద్యోగులు లక్షలాదిగా పెరిగిపోయారు.

ఒక్కో ఉద్యోగానికి 50 మంది

ఉమ్మడి జిల్లాలో పోస్టులు తక్కువ

వెల్లువెత్తిన దరఖాస్తులు

పరీక్షకు 38,617 మంది..

జూన్‌ 6 నుంచి పరీక్షలు

కాకినాడ రూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీకి దరఖాస్తులు పోటెత్తాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నిరు ద్యోగులు లక్షలాదిగా పెరిగిపోయారు. ఈ నేప థ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తం గా డీఎస్సీకి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అన్ని మేనేజ్‌మెంట్లకు కలిపి 1241 పోస్టులుండగా, 63,004 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోస్టుకు సగటున 50 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందేనని నిరుద్యోగ ఉపా ధ్యాయ అభ్యర్థులు అనుకుంటున్నారు.

15తో ముగిసిన గడువు

డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 63,004 దరఖాస్తులు వచ్చాయి. 38,617 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకోగా 14,380 మంది పురుషులు, 24,237 మంది మహిళలు ఉన్నారు. దరఖా స్తుల నమోదులో మహిళలే టాప్‌గా ఉండ డం విశేషం. కేటగిరీల వారీగా ఓసీ 5,120, బీసీ-ఏ 2,810, బీసీ-బీ 6,991, బీసీ-సీ 554, బీసీ-డీ 3,636, బీసీ-ఈ 568, ఎస్సీ గ్రేడ్‌-1 87, ఎస్సీ గ్రేడ్‌-2 2,572, ఎస్సీ గ్రేడ్‌-3 10,066, ఎస్టీ-6,213, ఈడబ్ల్యూఎస్‌ 3,782, అలాగే దివ్యాంగుల కేటగిరీ నుంచి వీఎచ్‌ 159, హెచ్‌హెచ్‌ 36, ఓహెచ్‌ 847, ఎంఐ 6 మంది అభ్య ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 15తో ముగిసింది. 20 నుంచి మాక్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. హాల్‌ టికెట్లను ఈనెల 30 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకూ ఆయా కేటగిరీల వారీగా సీబీటీ విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదలచేసి మెరిట్‌ జాబితా ప్రకటించనున్నారు.

ఉద్యోగాల వివరాలివీ..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ 608, పీఈటీలు 210, ఎస్జీటీ 423 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసి స్టెంట్‌ పోస్టులు తెలుగు 65,హిందీ 78, ఆంగ్లం 95, గణితం 64, ఫిజికల్‌ సైన్స్‌ 71, బయోలాజికల్‌ సైన్స్‌ 103, సోషల్‌ 132, వ్యాయామ విద్య 210 ఉద్యోగాలతోపాటు 423 సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమకు సంబంధించి ఫిజికల్‌ సైన్స్‌ 3, బయోలాజికల్‌ సైన్స్‌ 4, స్కూల్‌ అసి స్టెంట్‌ వ్వాయామ విద్య 1, ఎస్జీటీలు 104 మొత్తం 112 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్జీటీలతో కలిపి 31 పోస్టులు భర్తీకానున్నాయి. జోన్‌ 2 (ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా)కి సంబందించి ఏపీఆర్‌ఎస్‌, ఏపీఎంఎస్‌, ఏపీఎస్‌డ బ్ల్యూ, బీసీ, సోషల్‌ వెల్ఫేర్‌కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24లతో కలిపి మొత్తం 348 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. ఇక డీఎస్సీకి దరఖాస్తుచేసుకున్నవారిలో మహిళా అభ్యర్థులే ఎక్కువ.

Updated Date - May 22 , 2025 | 01:10 AM