డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:21 AM
ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. మత్తు పదార్థాలకు అలవాడు పడితే ప్రాణాలు కోల్పోతారన్నారు. మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినం పురస్కరించుకుని గురువారం అమలాపురం సత్తెమ్మతల్లి గుడి దగ్గర నుంచి పేరూరుపేట వై.జంక్షన్ వరకు విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. మత్తు పదార్థాలకు అలవాడు పడితే ప్రాణాలు కోల్పోతారన్నారు. మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినం పురస్కరించుకుని గురువారం అమలాపురం సత్తెమ్మతల్లి గుడి దగ్గర నుంచి పేరూరుపేట వై.జంక్షన్ వరకు విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిరోధంలో పోలీస్, ఇతర అధికారులు చేస్తున్న కృషికి అందరూ సహకరించి ఈ అక్రమ మాదక ద్రవ్యాల రవాణా అరికట్టాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజంలో అరాచకాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. డ్రగ్స్ చాక్లెట్లు, ఇతర లిక్విడ్స్ రూపంలో ఎక్కడైనా తారస పడితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని జేసీ నిషాంతి సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్, సీఐ పి.వీరబాబు, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్, డీఈవో షేక్ సలీంబాషా, డీఎంహెచ్‌వో దుర్గారావుదొర,ఐసీడీఎస్ పీడీ శాంతికుమారి, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Jun 27 , 2025 | 01:22 AM