ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రిప్‌..నో గ్రిప్‌!

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:48 AM

ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీ ఎంఐపీ) అనే సూక్ష్మనీటి సాగు పథకం..దీనినే డ్రిప్‌ ఇరిగేషన్‌ అని అంటారు.

డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం ఏర్పాటు చేస్తున్న అధికారులు

రాయితీలు ఉన్నా నిర్లక్ష్యం

ముందుకు రాని రైతాంగం

నెరవేరని సర్కారు లక్ష్యం

నేటికీ అవగాహనా లోపమే

3,800 హెక్టార్లు లక్ష్యం

169.15 హెక్టార్లకే పరిమితం

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీ ఎంఐపీ) అనే సూక్ష్మనీటి సాగు పథకం..దీనినే డ్రిప్‌ ఇరిగేషన్‌ అని అంటారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ అంటే ప్రతి మొక్కకు ఓ పైపు ద్వారా నీటిని పంపిస్తారు. తుంపర్లు అంటే వాన తుంపర్లు పడినట్టు నీటిని జల్లే విధానం. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చు. కనీసం 10 సెంట్ల భూమి ఉన్నా నీటి సదుపాయం ఉంటే చాలు రాయితీతో ఈ పథకాన్ని ఉపయోగిం చుకోవచ్చు.2003 నవంబరు నుంచి వ్యవ సాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలకు సంబ ంధించిన పంటలకు ప్రభుత్వం రాయితీ ద్వారా సూక్ష్మనీటి సాగులో భాగంగా డ్రిప్‌ (బిందు), తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. నీటిని వృఽథా చేయకుండా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 3800 హెక్టా ర్లలో బిందు సేద్యం, తుంపర సేద్యంను పోత్స హించడం లక్ష్యంగా ఉంది. జిల్లాలో మండ లాల వారీ సూక్ష్మనీటి సాగుపథకం నత్తన డకన సాగుతోంది. మొత్తం జిల్లాలో 2282 మంది రైతు 2753.64 హెక్టార్ల కోసం ఇప్పటి వరకూ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకూ కేవలం 111 మంది రైతులకు సంబంధించిన 169.15 హెక్టార్లలో మాత్రమే అమలైంది.రాజమండ్రి డివిజన్‌లో 722 మంది రైతులు 799.78 హెక్టార్లకు రిజిస్ర్టేషన్‌ చేయిం చుకున్నారు. కానీ ఇప్పటి వరకూ 22 మంది రైతులకు చెందిన 28.75 హెక్టార్లలో మాత్రమే పథకం అమలైంది. కొవ్వూరు డివిజన్‌లో 1560 మంది రైతులు 1953.86 హెక్టార్లలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు.అందులో ఇప్పటి వరకూ 89 మంది రైతులకు సంబంధించిన 140.40 హెక్టార్లలో మాత్రమే పథకం అమలైంది.కొ న్ని మండలాల్లో ఒకటి కూడా అమలు కాలేదు.

రాయితీ వివరాలు

చిన్న రైతులైన ఎస్సీ, ఎస్టీలకు 2 హెక్టార్ల వరకూ 100 శాతం రాయితీ ఇస్తారు. ఇతర చిన్నరైతులకు రెండు హెక్టార్ల వరకూ బిందు సేద్యానికి 90 శాతం రాయితీ అంటే రూ.2.18 లక్షలు వరకూ ఇస్తారు. సన్నకారు రైతులకు 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల వరకూ 70 శాతం రాయితీ అంటే రూ.3.10 లక్షలు ఇస్తారు. పెద్ద రైతులైతే 4 నుంచి 5 హెక్టార్ల వరకూ బిందు సేద్యానికి 50 శాతం రాయితీ అంటే రూ.4 లక్షల వరకూ ఇస్తారు. అందరు రైతులకు తుంపర సేద్యానికి 50 శాతమే రాయితీ..అంటే రూ.19 వేలు ఇస్తా రు.. కనీసం 10 సెంట్ల స్థలం ఉండి సాగు చేస్తున్నా పథకానికి అర్హు లే. తప్పనిసరిగా నీటి సదుపాయం ఉం డాలి. రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలి. బయోమెట్రిక్‌ రిజిస్ర్టేషన్‌ చేస్తారు. ఫీల్డ్‌ సర్వే చేసి, రైతు ఆధార్‌ కార్డు, పాస్‌బుక్‌ ఆధా రంగా ఎంపిక చేస్తారు. సబ్సిడీ మినహా మిగిలిన సొమ్మును చెల్లించిన తర్వాతే అధికారులు డ్రిప్‌ ఇరి గేషన్‌, తుంపర సేద్యం ఏర్పాట్లు చేస్తారు. ఏడేళ్ల వరకూ మరమ్మతులను ప్రభుత్వమే భరిస్తుంది.

మండలాల వారీ ఇలా..

మండలం రిజిస్ర్టేషన్‌ హెక్టార్లు మంజూరు హెక్టార్లు

కొవ్వూరు 31 25.84 4 3.36

చాగల్లు 135 180.11 12 18.58

తాళ్లపూడి 45 68.51 4 7.29

నిడదవోలు 48 54.62 3 4.89

ఉండ్రాజవరం 3 3.18 0 0

పెరవలి 10 9 4 3.69

దేవరపలి 369 501.63 15 32.34

గోపాలపురం 383 481.43 9 12.79

నల్లజర్ల 536 629.54 38 57.46

సీతానగరం 81 78.74 1 0.69

కోరుకొండ 95 92.86 2 1.07

గోకవరం 90 100.50 2 1.19

రంగంపేట 275 285.10 13 18.3

రాజానగరం 116 160.53 1 1.13

రాజమండ్రి రూరల్‌ 11 9.67 0 0

కడియం 22 14.64 2 1.36

అనపర్తి 7 14.51 0 0

బిక్కవోలు 25 43.23 1 5

...............................................................................................

మొత్తం 2282 2753.64 111 169.15

Updated Date - Jul 21 , 2025 | 12:48 AM