ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

11 డ్రెడ్జింగ్‌ బోట్లు సీజ్‌

ABN, Publish Date - Jul 12 , 2025 | 01:08 AM

గోదావరి నదిలో ప్రతిరోజు రాత్రి పగలు తేడాలేకుండా డ్రెడ్జింగ్‌ బోట్లు ఇసుకను తోడేస్తున్నాయి. గామన్‌ బ్రిడ్జికి సమీపంలో డ్రెడ్జింగ్‌ పెద్దఎత్తున జరుగుతుంది.

డ్రెడ్జింగ్‌ బోట్లు పరిశీలిస్తున్న అధికారులు

రాజమహేంద్రవరం/రూరల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో ప్రతిరోజు రాత్రి పగలు తేడాలేకుండా డ్రెడ్జింగ్‌ బోట్లు ఇసుకను తోడేస్తున్నాయి. గామన్‌ బ్రిడ్జికి సమీపంలో డ్రెడ్జింగ్‌ పెద్దఎత్తున జరుగుతుంది. లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక బోట్ల నుంచి రేవులకు చేరి అక్కడ నుంచి లారీల్లో సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రిడ్జింగ్‌ బోట్లపై నిఘాపెట్టిన మైనింగ్‌ అధికారులు శుక్రవారం మెరుపుదాడి చేశారు. గామన్‌ బ్రిడ్జికి మత్స్యకారుల నివాసాలకు మధ్యలో అమ్మవారి ఆల యం పక్కనే నిలుపుదల చేసిన 8 డ్రెడ్జింగ్‌ బోట్లను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు. మాన్యువల్‌గా ఉన్నబోట్లను వదిలేశారు. దీంతో కాతేరు ,కోటిలింగాల ఇసుక రేవులు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే దాదాపుగా అన్ని రేవులు కూడా డ్రెడ్జింగ్‌ బోట్లను వినియోగించే ఇసుకను తోడేస్తున్నారు. ఈ ఘటనతో అఖండ గోదావరిలో డీసిల్టేషన్‌ పేరిట జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. గురు, శుక్రవారాల్లో అధికారులు తనిఖీ లు చేసి ధవళేశ్వరం, కోటిలింగాల, కాతేరు ప్రాంతాల్లో అనధికారికంగా..నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్‌ చేసే 11 బోట్లను అధికారులు సీజ్‌ చేశారు. ధవళే శ్వరంలో లలితాదేవి పేరుతో ఉన్న డ్రెడ్జింగ్‌ బోటులో ఉన్న భీమడోలు మండలం ఆగడాలలంకకు చెందిన ఘంట సాల ఏసురాజు, బాలకోటి రామ్మూర్తిని ఆరా తీయగా యజమానులెవరో తెలియదని చెప్పడం గమనార్హం. కానీ విచారణలో విశాఖపట్నానికి చెందిన రాకేష్‌ ఈ బోటుకు యజమాని అని స్థానికంగా ఉన్న బిక్కన రవి అనే వ్యక్తి వీటిని పర్యవేక్షిస్తారని తేలినట్టు అధికారులు తెలిపారు.శ్రీలలిత బోటుతో పాటు శ్రీ లక్ష్మి గణపతి వీరభ్రదయ్య , సద్గురు శ్రీ సాయినాథ సాత్విక్‌ డ్రెడ్జింగ్‌ బోటు, శ్రీలక్ష్మీ డ్రెడ్జింగ్‌ బోటును సీజ్‌ చేశారు. రాజమండ్రి కోటిలింగాల, కాతేరు గోదావరి తీరంలో బోయజు రుతు పేరుతో ఉన్న డ్రెడ్జింగ్‌ బోట్లు 2, కోటే శ్వరరావు పేరుతో డ్రెడ్జర్‌ మౌంటెడ్‌ పైబర్‌ బోటు, సుబ్రహ్మణ్య ఆంజనేయ,శ్రీ శ్యామలాంబ మెకనైజ్డ్‌ బో ట్లు, శ్రీశ్యామలాంబ అండ్‌ విఘ్నేశ్వర బోటు, శ్రీవిద్యా నంపాట లక్ష్మి బోటు,మరో రెండు పేరు లేని బోట్లు స్వాఽధీనం చేసుకుని ఇరిగేషన్‌ ఏఈకి అప్పగించారు.

Updated Date - Jul 12 , 2025 | 01:08 AM