ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:36 AM
ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా ఉంటేనే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని...అందువల్ల ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర నీటిపారుదల శాఖ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఓఅండ్‌ఎం పనులపై నివేదిక
ఇసుక అందుబాటులో ఉంచాలి
ధాన్యం లక్ష్యం పెంచేలా చర్యలు
డీఆర్‌సీ మీటింగ్‌లో మంత్రి నిమ్మల
రాజమహేంద్రవరం రూరల్ / సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా ఉంటేనే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని...అందువల్ల ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర నీటిపారుదల శాఖ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ పాజెక్టుల నిర్వహణ (ఓఅండ్‌ఎం)పై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి వేసవిలో పనులు పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబం డేటా వివరాలు స్థానిక ప్రజాప్రతినిధులు ద్వా రా నిర్ధారణ చేసుకుని 20 శాతం మంది అర్హులైన వారికి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు చేరేలా చూడాలన్నారు. వరదల సమయంలో కూడా ప్రజలకు ఉచిత ఇసుక అందించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద అక్రమ లావాదేవీలు అరికట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు.సెమీ మెకనైజ్డ్ యంత్ర పరికరాలు ద్వా రా ఇసుక తవ్వకాలు జరిపితే ధర బాగా తగ్గుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత ఇసుక సరఫరా విధానంలో మరింత విజిలెన్స్ పెంచడంపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మే నెలాఖరు వరకు ఇసుక సరఫరాలో ఎటు వంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రశాంతి ప్రతి నియోజకవర్గంలో రెండు చొప్పున స్టాక్ పాయిం ట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వేసవి లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గోకవరం మండలంలో ప్రతిగ్రామంలో తాగునీటి సరఫరా చేసే విధంగా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్‌ను 2027 వరకు పొడిగించడం జరిగిందన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచాలని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కోరామన్నారు. రబీలో సమర్థవంతంగా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. చెరువులు పూడిక తీతకు సంబంధించి జీవో జారీ చేస్తామన్నారు.పీ-4 కు సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులను నియమిస్తున్నట్టు చెప్పారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ ఇటీవల గోదావరి ప్రమాదాలు దురదృష్టకమన్నారు. స్కూల్స్, కళాశాలల్లోనే ఇటువంటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పిం చాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వృఽథాగా ఉన్న ఇరిగే షన్ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్య లు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరాలకు అంతరాయం లేకుండా చూడాలన్నా రు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో శాఖల వారీగా ఇప్పటి నుంచే సంసిద్ధులు కావాల్సి ఉందన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గం పరిధిలో మైనర్ మీడియం ఇరిగిషన్ ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో హేతుబద్ధత కలిగిన సర్వే చేపట్టడంలేదన్నారు. దీనిపై స్పం దించిన మంత్రి సరైన విధంగా ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా డి.ముప్పవరం స్కూలును వేరొక ప్రాంతానికి మార్చడం జరుగుతుందని ఇది ఇబ్బందికరంగా ఉందని మంత్రి దుర్గేష్ సభ దృష్టికి తెచ్చారు. ఎంపీపురందేశ్వరి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియను అనుసరించి స్కూల్ మార్చడం జరుగుతుంద న్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ఉత్పత్తులు పాడైపోవడం గుర్తించామ న్నారు. ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి సమావేశానికి నివేదికలు సిద్దం చేయాలని ఇంచార్జి మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సీఎం కార్యక్రమాల సమన్వయ కర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి జేసీ ఎస్ చిన్నరాముడు, కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్‌వో సీతారామమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
నిమ్మల చెంత.. నిడదవోలు పంచాయితీ
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్ర జ్యోతి) : నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ నాయకుల మధ్య వివాదాన్ని మంత్రి నిమ్మ ల రామానాయుడు సర్దుబాటు చేసినట్టు సమా చారం.ఈ మేరకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వేదికగా సోమవారం మంత్రి నిమ్మల రామానాయుడు నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు, ఆయన వర్గీయులతోను, మంత్రి కందుల దుర్గేష్, ఆయన వర్గీయులతోనూ భేటీ అయ్యారు. నియోజవర్గంలో ఏర్పడిన చిన్నపాటి సమన్వయ లోపాలపై సుమా రు 30 నిమిషాలపాటు చర్చించారు.జిల్లా వ్యాప్తం గా ఉన్న టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలు పాల్గొని స్నేహపూర్వక వాతావరణం కుదిర్చినట్టు తెలిసింది.
Updated Date - Apr 22 , 2025 | 12:36 AM