ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రై‘లేజీ’ పనులు

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:06 AM

జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు మునిసిపా లిటీలు కాగా రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌. వీటి పరిధిలో ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్‌ లోపుగా డ్రైన్లలోని సిల్టు (పూడిక) తీయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే పూడిక వల్ల వర్షం నీటికి అడ్డంకి ఏర్పడి రోడ్లను ముం చెత్తుతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి దాపురిస్తుంది.

రాజమహేంద్రవరంలోని మేకల కబేళా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలు
  • ‘చినుకు పడితే మునకే’

  • డ్రైన్లలో పూర్తి కాని పూడికతీత

  • నీటి ప్రవాహానికి ఔట్‌ లెట్ల సమస్య

  • జిల్లాలోని పలు మునిసిపాలిటీల్లో పరిస్థితి ఇదీ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు మునిసిపా లిటీలు కాగా రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌. వీటి పరిధిలో ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్‌ లోపుగా డ్రైన్లలోని సిల్టు (పూడిక) తీయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే పూడిక వల్ల వర్షం నీటికి అడ్డంకి ఏర్పడి రోడ్లను ముం చెత్తుతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి దాపురిస్తుంది. దీని వల్ల ప్రతి ఏడాదీ ఇదొక ముఖ్యమైన పనిగా చేస్తుం టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూడిక తీతకు నిధులివ్వకపోవడం... ఆ పనులకు పెద్దగా ప్రా ధాన్యం కనబరచకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులపై శ్రద్ధ పెట్టినా వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోవడం తో గుత్తేదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జూన్‌ నెలాఖరుకు చేరుకుంటున్నా పూడి కతీత పనులు పూర్తి కాలేదు. వర్షాకాలంలో పూ డిక తీత కుదరదు. వర్షాలు పడే సమయంలో ఆ పూడిక తీస్తే రోడ్లన్నీ బురదమయం అయిపోయి దుర్వాసన వస్తుంది. రోగాలు వ్యాపిస్తాయి. అం దువల్ల పూడికతీతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎం డాకాలంలోనే పూర్తిచేయాలి. కానీ జిల్లాలోని రెం డు మునిసిపాలిటీలు, ఒక మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పూడిక తీయాల్సిన డ్రైన్లు ఉన్నా యి.మేజర్‌ డ్రైన్లలో సైతం పనులు పూర్తవ్వలేదు.

  • రహదారులు.. చెరువులు

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జిల్లా కేంద్ర మైన రాజమహేంద్రవరాన్ని ముంపునీటి బారి నుంచి బయట పడేయలేకపోతున్నాయి. రెండేళ్ల లో పుష్కరాలు రానున్నాయి. అయినా పరిస్థితి ఓ కొలిక్కి రాలేదు. గత వైసీపీ ప్రభుత్వ హ యాంలో వై.జంక్షన్‌ నుంచి లాలా చెరువు వర కూ డ్రైన్లపై స్లాబులు వేసి సిమెంటు బిళ్లలు అతికించారు. రోడ్డుపై నీరు డ్రైనులోకి వెళ్లడానికి చిన్నపాటి రంధ్రాలను ఏర్పాటు చేశారు. డ్రైను లో ముంపునీటి ప్రవాహానికి ఎక్కడైనా అడ్డుకట్ట పడితే ఎక్కడ వీలుంటే అక్కడ నుంచి మురు గునీరు రోడ్లను ముంచెత్తుతోంది. కంబాల చెరు వు క్వారీ మార్కెట్‌ రోడ్డు దుస్థితి అలాగే ఉంది. ముంపునీటి రిజర్వాయరుగా పని చేసే కంబాల చెరువుకు హంగులద్ది పార్కు పేరుతో టికెట్‌ పెట్టారు. దీంతో ఎగువ నుంచి వచ్చే ముంపు నీటి ప్రవాహానికి సరైన దారిలేక ఈ ప్రాంతం మునిగిపోతోంది. బ్రదరన్‌ చర్చి నుంచి రామ కృ ష్ణామఠం, దేవీచౌక్‌లు ఈ దుస్థితికి ఉదాహరణ లుగా చూపవచ్చు. నగర పరిధిలో మేజర్‌ డ్రైన్లు 21.34 కిలోమీటర్లు ఉండగా 18.89 కిలోమీటర్లు, మీడియం డ్రైన్లు 74.41కి 65 కిలోమీటర్ల మేర సిల్టు తీత పూర్తయింది. 450 కిలోమీటర్ల మైనర్‌ డ్రైన్లన్నీ శుభ్రం చేశామని అధికారులు చెబుతు న్నారు. వీధుల్లో డ్రైన్లు మురుగుతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి.

  • కొవ్వూరు ఔట్‌లెట్‌ అస్తవ్యస్తం

కొవ్వూరులో మొత్తం 105.24 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అందులో మేజర్‌ డ్రైన్లు 2.21 కిలో మీటర్లు ఉండగా కేవలం 210 మీట ర్లు, మీడియం 33.3 కిలోమీటర్లకు 16.60 కిలో మీటర్లు మాత్రమే పూడిక తీత పూర్తయింది. మైనర్‌ డ్రైన్లు 70 కిలోమీటర్లు రోజూ శుభ్రం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పూడిక తీత పనులకు రూ.45 లక్షలతో టెండర్లు ఖరారు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో గుత్తేదారులు సగం లో చేతులెత్తేశారు. ఈ పట్టణంలో డ్రైనేజీ ఔట్‌ లెట్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో సవ్యంగా లేకపోవడంతో వర్షాలు పడితే ముంపు నీరు రోడ్లను ముంచెత్తుతోంది.

  • డ్రైనేజీలు వెడల్పు చేయాలి

నిడదవోలులో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. వర్షమొస్తే ప్రధాన మార్గా లు, బస్టాండ్‌, ఆర్టీసీ డిపో, గణేశ్‌ చౌక్‌, బస్టాం డ్‌ సెంటర్‌ మునిగిపోతాయి. డ్రైనేజీ వ్యవస్థల ఔట్‌లెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వర్షమొస్తే నిడదవోలు రోడ్లపై తిరగడానికి తిప్పలు పడా ల్సిందే. భారీ వర్షమైతే వీధులు వరదను తల పిస్తాయి. డ్రైనేజీలను వెడల్పు చేయాల్సిన అవ సరమున్నా ఆ దిశగా ఆలోచన చేసినట్టు కన బడడం లేదు. సిల్ట్‌ తీత పనులు పూర్తయ్యా యని చెబుతున్న అధికారులు.. వివరాలు ఇవ్వ డానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. నిడ దవోలు నియోజకవర్గానికి మంత్రి కందుల దుర్గేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడాది పా లన గడిచింది. అయిన ప్పటికీ ప్రధాన మార్గాలు చినుకు పడితే ముంపునకు గురవుతుండడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:06 AM