ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యావరణానికి హాని చేయొద్దు

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:49 AM

అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని చేకూర్చకూడదని, పర్యావరణ హితంగా జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. వర్శిటీ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలోని కామర్స్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధిపై శుక్రవారం జరిగిన రెండు రోజుల జాతీయ సెమినార్‌ను వీసీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

సెమినార్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ ప్రసన్నశ్రీ
  • ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

  • పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై జాతీయ సెమినార్‌

దివాన్‌చెరువు, మార్చి21 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని చేకూర్చకూడదని, పర్యావరణ హితంగా జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. వర్శిటీ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలోని కామర్స్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధిపై శుక్రవారం జరిగిన రెండు రోజుల జాతీయ సెమినార్‌ను వీసీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవిని అక్షరాన్ని కలిపి నాటానని, అడవిలో అక్షర సేద్యం చేస్తూ వచ్చానని, వాటి వృద్ధిని చూసానని ఇటువంటి స్థిరమైన వృద్ధే సుస్థిర అభివృద్ధి అన్నారు. విశ్రాంత ఆచార్యులు పి.సుబ్బారావు మాట్లాడుతూ ఏకోప్రెన్యూర్‌ షిప్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ మధ్య వ్యత్యాసాలను వివరించారు. సమావేశంలో వర్ధమాన పారిశ్రామిక వేత్త సౌజన్య, ఎ.బిందు, కె.లావణ్య, పి.నిరీష, సెమినార్‌ కన్వీనర్‌ ఆచార్య పి.ఉమామహేశ్వరీదేవి, ఆచార్య ఎన్‌. ఉదయ భాస్కర్‌ పాల్గొన్నారు. సెమినార్‌కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెమినార్‌ హాల్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను వీసీ సందర్శించి నిర్వాహకులను అభినందించారు.

Updated Date - Mar 22 , 2025 | 12:49 AM