ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తోనే..

ABN, Publish Date - May 21 , 2025 | 12:16 AM

మలికిపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఈ మధ్య సినిమాలకు గ్యా

మలికిపురం మండలం మట్టపర్రులో ఓ బాలుడికి ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సుకుమార్‌

ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌

మలికిపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్‌ ఎక్కువ వచ్చిందని అడగ్గా నవ్వి ఊరుకున్నారు. పుష్ప- 2 చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలను థియేటర్లలో, టీవీల్లో వీక్షిస్తున్నారని, పట్టణాల్లో యాప్‌లతో మమేకమవుతున్నారని తెలిపారు. తాను మొదటిగా పేపర్‌ చూసేటప్పుడు స్పోర్ట్స్‌, సినిమాలు, తరువాత రాజకీయాలు చదువుతానన్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ సుకుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.కాసేపు మాట్లాడారు.

Updated Date - May 21 , 2025 | 12:16 AM