ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెరుగుతూ..తగ్గుతూ...

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:31 AM

ధవళేశ్వరం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద పెరుగుతూ ప్రవహించిన గోదావరి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగి ఆపై తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయానికి అత్యధికంగా 6,56, 341క్యూసెక్కులు కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ద్వారా దిగువకు ప్రవహించింది. ఈ సమయంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.90 అడుగులుగా నమో

ధవళేశ్వరం బ్యారేజ్‌ గేట్ల నుంచి దిగువకు ప్రవహిస్తున్న వరద నీరు

కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి ప్రహహం

అత్యధికంగా 6,56,341 క్యూసెక్కులు సముద్రంలోకి...

ధవళేశ్వరం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద పెరుగుతూ ప్రవహించిన గోదావరి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగి ఆపై తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయానికి అత్యధికంగా 6,56, 341క్యూసెక్కులు కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ద్వారా దిగువకు ప్రవహించింది. ఈ సమయంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.90 అడుగులుగా నమోదైంది. మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగిన ప్రవాహం ఆపై తగ్గుముఖం పట్టి సాయంత్రానికి 40 వేల క్యూ సెక్కులకు పైగా తగ్గి 6,14,762 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఎగువున భద్రాచలం వద్ద 24గంటల వ్యవధిలో 10 అడు గుల మేర తగ్గిన నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 30.60 అడుగులకు చేరుకుంది. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి వ్యవసాయ అవసరాల కోసం తూర్పుడెల్టాకు 4,800క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2600 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 6800 క్యూసెక్కు లు చొప్పున నీరు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:31 AM