ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు పవన్‌ కల్యాణ్‌ రాక

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:26 AM

అఖండగోదావరి పర్యాటక ప్రాజెక్టు, సైన్స్‌ మ్యూజియం, అటవీ అకాడమీ శంకుస్థాపన,ప్రారంభోత్సలకు గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రానున్నారని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్‌, ఎస్పీ నరసింహ కిశోర్‌
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాజమహేంద్రవరం/దివాన్‌చెరువు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : అఖండగోదావరి పర్యాటక ప్రాజెక్టు, సైన్స్‌ మ్యూజియం, అటవీ అకాడమీ శంకుస్థాపన,ప్రారంభోత్సలకు గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రానున్నారని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఆమె అధికారులతో పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. తొలుత అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తర్వాత సైన్స్‌ మ్యూజియం ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దివాన్‌ చెరువులో అటవీ అకాడమీకి శంకు స్థాపన చేస్తారన్నారు. అఖండగోదావరి పర్యా టక ప్రాజెక్టుకు పుష్కరఘాట్‌లో శంకుస్థాపన చేస్తారని..అక్కడే బహిరంగ సభ ఉంటుంద న్నారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారన్నా రు.రూట్‌మ్యాప్‌ సిద్ధం అయినట్టు చెప్పారు.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పర్యటన ఏర్పాట్లను మంగళవారం మంత్రి కందుల దుర్గేష్‌ ,జేసీ ఎస్‌.చిన్నరాముడు, ఎస్పీ నర సింహ కిశోర్‌,ఇతర అధికారులతో కలసి పరి శీలించారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసు కోవాలని ఆదేశించారు. పుష్కరఘాట్‌లో శం కుస్థాపన, బహిరంగ సభా వేదికపై చర్చిం చారు. పుష్కరఘాట్‌, హేవలాక్‌ బ్రిడ్జిలను పరిశీలించారు. బొమ్మూరులో సైన్స్‌ మ్యూజి యంను పరిశీలించారు. అటవీ అకాడమీలో ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే బత్తులబలరామకృష్ణ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అటవీ అకాడమీ ఏర్పాటుకు దివాన్‌చెరువు అనుకూల ప్రాంతమని పవన్‌కల్యాణ్‌ కేంద్రంతో సంప్రదించడంతో మంజూరైందన్నారు. అటవీ అకాడమీ డైరెక్టర్‌ బి.విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర అటవీ అకాడమీని తాత్కాలికంగా అటవీ పరిశోధనా కేంద్రంలో 2015 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం అటవీ అకాడమీ ఉన్న ప్రాంగణంలోనే 12 ఎకరాల్లో రూ.30 కోట్లతో వివిధ నిర్మాణాలను రెండు దశలుగా జరిపేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందన్నారు. మొదటి దశలో ఆరెకరాల్లో రూ.18.30 కోట్లతో చేపట్టబోయే నిర్మాణాలకు ఈ నెల 26న భూమి పూజ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో వి.ప్రభాకరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 01:26 AM