ఆశలు..గల్లాస్!
ABN, Publish Date - May 02 , 2025 | 01:30 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మ న్ పదవీ పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆఖర్లో అనూహ్యంగా ఈ కీలక పదవిని జన సేన ఎగరేసుకుపోయింది.
ఇంతకాలం టీడీపీకేనని నిర్ణయం
చివర్లో అనూహ్య మార్పు
పశ్చిమ డీసీసీబీ టీడీపీ..
తూర్పు జనసేనకు పంపకాలు
రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన
పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డికి ఛాన్స్!
నిరాశలో టీడీపీ ఆశావహులు
కోనసీమకు డీసీఎంఎస్ చైర్మన్
ఇద్దరు టీడీపీ నేతల పరిశీలన
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మ న్ పదవీ పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆఖర్లో అనూహ్యంగా ఈ కీలక పదవిని జన సేన ఎగరేసుకుపోయింది.ఈ కుర్చీ టీడీపీ తీసు కోవాలని తొలుత నిర్ణయం జరగ్గా ఆఖరి నిమి షంలో సమీకరణాలన్నీ మారిపోయాయి. టీడీ పీకి బదులు జనసేనకు డీసీసీబీ ఇచ్చే యాలని నిర్ణయం జరిగింది. పశ్చిమ డీసీసీబీ టీడీపీ, తూర్పుగోదావరి డీసీసీబీ జనసేన తీసుకునేలా ఎట్టకేలకు నిర్ణయించారు. జనసేన నుంచి పిఠాపురం ఇన్‌ఛార్జి మర్రెడ్డికి పదవి దక్కే అవ కాశాలు కనిపిస్తున్నాయి.అటు చైర్మన్ కుర్చీ టీడీపీదేనని ఇంతకాలం భావించిన ఆశావహు లు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. ఎమ్మె ల్యేల వద్ద నిట్టూర్చుతున్నారు. కాగా డీసీఎంఎస్ చైర్మన్ పదవికి కోనసీమ జిల్లాకు చెందిన ఇద్ద రు టీడీపీ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఆఖర్లో అనూహ్యంగా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుర్చీ అంటే అదో హోదా. రాష్ట్రంలో అతిపెద్ద డీసీసీబీ తూర్పుగోదావరిదే. కూటమి అధికారంలోకి రావడంతో ఈ పదవి దక్కించు కోవాలని మూడు నెలలుగా అనేక మంది టీడీ పీ నేతలు పావులు కదిపారు. ఉభయగోదావరి జిల్లాల నేతలు అధిష్ఠానం వద్ద పంచాయతీ పెట్టి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుర్చీ జనసేనకు..తూర్పుగోదావరి టీడీ పీకి ఇచ్చేలా కొంత కాలం కిందట నిర్ణయిం చారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలు వురు టీడీపీ ఆశావహులు తమ ప్రయత్నాలు ఆరంభించారు. ప్రధానంగా జడ్పీ చైర్మన్‌గా గతంలో పనిచేసిన జ్యోతుల నవీన్‌కు అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. కాకినాడ రూర ల్ కోఆర్డినేటర్ బాబి అయితే తనకు గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ టికెట్ రానందున డీసీసీబీ అయినా సాధించుకోవాలని మంత్రులు, ఎమ్మె ల్యేల వద్దకు వెళ్లి వారి నుంచి లేఖలు సేకరిం చారు. కోనసీమ నుంచి మెట్ల రమణబాబు, మెట్ట నుంచి తోట నవీన్ తదితరులు ఆశలు పెంచుకున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు డీసీసీబీ నామినేటెడ్ చైర్మన్ పోస్టులు ప్రకటించి నప్పుడు ఆ జాబితాలో రెండు ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల చైర్మన్ల ప్రకటన వాయిదా ప డింది. తీరా పశ్చిమ డీసీసీబీ జనసేనకు బదు లు టీడీపీకి ఇవ్వాలనే ఒత్తిడి పెరగడంతో సమీ కరణలు మార్చాల్సి వచ్చి ఉమ్మడి తూర్పు చైర్మ న్ పేరు వాయిదా వేశారు. మూడు రోజు లుగా ఈ రెండు జిల్లాలకు సంబంధించిన టీడీపీ నేత లతో పార్టీ పెద్దలు అమరావతిలో చర్చలు జరి పారు. పశ్చిమ డీసీసీబీ కుర్చీ టీడీపీ తీసుకుని ఉమ్మడి తూర్పు కుర్చీని జనసేనకు కేటాయిం చాలని తీర్మానించారు.అనేక తర్జనభర్జనల తర్వా త ఉమ్మడి తూర్పుగోదావరి డీసీ సీబీ చైర్మన్ కుర్చీ జనసేనకు ఇచ్చేయాలని టీడీపీ నిర్ణయిం చింది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈసా రికి డీసీసీబీ ఉమ్మడి జిల్లాలో టీడీపీకి ఇచ్చేలా అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలిం చలేదు. తాజా నిర్ణయంపై టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.అధిష్ఠానం వద్ద ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇదే ఏకరువు పెట్టినా పొత్తు ధర్మం పాటించాల్సిందేనని అధిష్ఠానం తెగేసి చెప్పింది. ఆశావహులు తమకు అన్యా యం జరిగిందం టూ ఎమ్మెల్యేల వద్ద నిట్టూర్చుతున్నారు.
ఆ కుర్చీ ఆయనకేనా..
డీసీసీబీ చైర్మన్‌గా పిఠాపురం ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఎన్నికల ముందు ప్రకటించిన ప్పటి నుంచి మర్రెడ్డి పార్టీలో క్రియా శీలకంగా పనిచేస్తున్నారు. అంతకుముందు అనపర్తి జన సేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఈయ న్ను పిఠాపురం తీసుకువచ్చారు.అప్పటి నుంచీ ఇప్పటి వరకు పిఠాపురం జనసేన పిఠాపురం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో ఈయనకు పదవి ఇవ్వాలని నిర్ణయం జరిగి నట్టు తెలిసింది. మరోపక్క మర్రెడ్డి తర్వాత పార్టీలో చేరిన తోట సుధీర్‌కు ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ చైర్మన్, జిల్లా పార్టీ అఽధ్య క్షుడు తుమ్మలబాబుకు కుడా చైర్మన్ పదవి ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వేముల పాటి అజయ్‌కు టిడ్కో చైర్మన్, హరిప్రసాద్‌కు ఎమ్మె ల్సీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా తరపున మర్రెడ్డి పేరు తర్వాత లిస్టులో ఉండడంతో ఇప్పుడు ఈయనకు డీసీసీబీ పదవి కట్ట బెట్టాలని పార్టీ యోచిస్తోంది.కోనసీమ జిల్లా కొత్తపేటకు చెం దిన బండారు శ్రీనివాస్ పేరు ప్రచారంలోకి వస్తున్నా మర్రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.మర్రెడ్డిని డీసీసీబీ చైర్మన్‌గా పంపి ఎమ్మెల్సీ నాగబాబును పిఠాపురం ఇన్‌ఛా ర్జిగా నియమిస్తారనే చర్చ జనసేనలో జరుగుతోంది.
డీసీఎంఎస్ చైర్మన్ ఎవరో..
డీసీసీబీ చైర్మన్ కుర్చీ జనసేనకు ఇచ్చేసిన నేప థ్యంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని టీడీపీ తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈ పదవికి టీడీపీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ జనసేన, డీసీఎంఎస్ చైర్మన్ టీడీపీ తీసుకోవాలనే నిర్ణయం జరగ డంతో ఉమ్మడి తూర్పులో డీసీసీబీ చైర్మన్ టీడీ పీ, డీసీఎంఎస్ చైర్మన్ జనసేన నుంచి ఎం పిక చేయాల్సి ఉంది. కానీ ఆఖర్లో అన్నీ మార డంతో ఇప్పుడు టీడీపీ ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన ఇద్దరు పార్టీ సీనియర్ నేతల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది.వీరిలో పెచ్చెట్టి చంద్రమౌళి,పెచ్చెట్టి విజయలక్ష్మి ఉన్న ట్టు తెలిసింది.చంద్రమౌళి పార్టీ రాష్ట్ర కార్య దర్శి కాగా,విజయలక్ష్మి కోనసీమ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.డీసీసీబీ చైర్మ న్,డీసీఎంఎస్ చైర్మన్ పేర్లను రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Updated Date - May 02 , 2025 | 01:30 AM