దళితుల సాంఘిక బహిష్కరణ
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:37 AM
పిఠాపురం/పిఠాపురం రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మం డలం మల్లాంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయంలో వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అధికారులు పర్యటించారు. ఇరువర్గాలతో శాంతికమిటీ ఏర్పాటు చేశారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని కలెక్టర్ ప్రకటించారు. పిఠాపురం మండలం మల్లాంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల
కాకినాడ జిల్లా మల్లాంలో ఉద్రిక్త పరిస్థితులు
పిఠాపురం/పిఠాపురం రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మం డలం మల్లాంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయంలో వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అధికారులు పర్యటించారు. ఇరువర్గాలతో శాంతికమిటీ ఏర్పాటు చేశారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని కలెక్టర్ ప్రకటించారు. పిఠాపురం మండలం మల్లాంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్య ంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేయ డం ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామంలోని ఒక ఇంటిలో ఎలక్ట్రికల్ పనులు నిమిత్తం వెళ్లిన పల్లపు సురేష్‌బాబు కరెంట్ షాక్‌కు గురై మరణించాడు. దీనికి గాను ఇంటి యజమాని జల్లిబాబు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని దళిత సంఘాలు డిమాండ్ చేయడంతో పాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం పిఠాపురం సీఐ సమక్షంలో జ రిగిన చర్చల్లో రూ.2.75లక్షలు పరిహారం ఇచ్చే ందుకు ఒప్పందం కుదిరింది. ఈ సంఘటన త ర్వాత అగ్రవర్ణాలు జరుగుతున్న పరిణామాలపై చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ దళితులను పనుల్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉద యం గ్రామంలో చికెన్ షాపులు, హోటళ్లకు వెళి ్లన దళితులకు మాంసం, టిఫిన్లు విక్రయించలే దు. పొలాలు, ఇతర పనులను దళితులకు అప్ప గించలేదు. దీంతో దళితులను సాం ఘిక బహి ష్కరణ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
అధికారుల పర్యటన
మల్లాంలో ఆదివారం కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్‌ఐ జానీబాషా పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. తమను సాంఘిక బహిష్కరణకు గురి చేయడం, తర్వా త జరిగిన సంఘటనలు గురించి దళితులు వారికి వివరించారు. దళితులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ యువజన సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు కోరారు.
శాంతికమిటీ ఏర్పాటు
మల్లాంలో పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం పిఠాపురం తహశీల్దార్ కార్యాలయంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు ఇరువర్గాల ప్రతినిధులతో శాంతికమిటీ ఏర్పాటు చేసి చర్చించారు. భవిష్యత్తులో ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. దళితులు, అగ్రవర్ణాలు సామరస్యంగా మెలగాలని సూచించారు. సాం ఘిక బహిష్కరణ వంటి అంశాలు జరిగితే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. చర్చల్లో సీఐ, తహశీల్దారు గోపాలకృష్ణ, పెద్దాపురం ఏ ఎస్‌డ్ల్యూవో వాణి పాల్గొన్నారు. కాగా మల్లాంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని కలెక్టర్ ప్రకటించారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు లేకు ండా అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు.
Updated Date - Apr 21 , 2025 | 12:37 AM