ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోట్లకు కోట్లు అమూలహ పాలు!

ABN, Publish Date - Jun 24 , 2025 | 01:38 AM

అమూల్‌ కోసం గత జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా బరితెగించింది. కోట్లాది ప్రజాధనాన్ని ఆ కంపెనీ పాలు చేసింది. కేవలం తనకు నచ్చని డెయిరీలను ఆర్థికంగా దెబ్బకొట్టడం కోసం ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో అమూల్‌ను నెత్తిన పెట్టుకుంది.

నేమాంలో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌

ఉమ్మడి జిల్లాలో మూలనపడ్డ బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు

అమూల్‌ కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా వెచ్చించిన వైసీపీ సర్కారు

పాల సేకరణ లేకుండానే రూ.8.50 కోట్లతో భవనాలు, కూలింగ్‌ యంత్రాలు

ప్రభుత్వం మారడంతో పాల సేకరణ సాగక చేతులెత్తేసిన అమూల్‌

ఫలితంగా బీఎంసీ కేంద్రాలు, యంత్రాలు ఎందుకూ పనికిరాని వైనం

తునిలో రేఖవానిపాలెం వద్ద భారీ చిల్లింగ్‌ సెంటర్‌ సైతం బోర్డు తిప్పేసిన వైనం

వీటిని టెండర్లు పిలిచి ప్రైవేటు డెయిరీలకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

అమూల్‌ కోసం గత జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా బరితెగించింది. కోట్లాది ప్రజాధనాన్ని ఆ కంపెనీ పాలు చేసింది. కేవలం తనకు నచ్చని డెయిరీలను ఆర్థికంగా దెబ్బకొట్టడం కోసం ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో అమూల్‌ను నెత్తిన పెట్టుకుంది. ఆ సం స్థకు పాల సేకరణ నుంచి సేకరించిన పాలను నిల్వ చేసే వరకు సర్వం తానే అయి పెట్టుబడి పెట్టింది. ఏకంగా రూ.8.50 కోట్లతో భవనాలు, యంత్రాలను సమకూర్చింది. అమూల్‌కే పాలు పోయాలంటూ పశు వైద్యుల ద్వారా రైతులపై ఒత్తిడి తెచ్చింది. తీరా ప్రభుత్వం మారడంతో ఉమ్మడి జిల్లాలో అమూల్‌కు పాలసేకరణ ఆగిపోయింది. ఆ కంపెనీకి పాలుపోసే నాథుడే లేకపోవడంతో ఇప్పుడు ఆ సంస్థ చేతులెత్తే సింది. అటు కాకినాడ జిల్లా తునిలోని రేఖవానిపాలెం వద్ద అమూల్‌ కోసం ప్రభుత్వం వెదికిపెట్టిన చిల్లింగ్‌ సెంటర్‌ బోర్డును సైతం అమూల్‌ తిప్పేసింది. ఫలి తంగా ఉమ్మడి జిల్లాలో కోట్లకు కోట్లు వెచ్చించిన బీఎంసీలు పాలు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో అమూల్‌ కోసం కొనుగోలు చేసిన మిల్క్‌ కూలింగ్‌ యంత్రాలు ఎందుకు కొరగాని పరిస్థితి నెలకొన్నాయి.

ఎన్ని ఆపసో‘పాలో’..

పాడి రంగానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. ఏటా 15.32 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు పాల దిగుబడి జరుగుతోంది. ఈ పాలను ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా విశాఖ, హెరిటేజ్‌, విజయ తదితర డెయిరీలు ఈ పాలను కొనుగోలు చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హెరిటేజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్తగా అమూల్‌ డెయిరీని రంగంలోకి దించింది. ఆ కంపెనీకి పాల సేకరణ నిలిపివే సేలా అమూల్‌కు ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా సహ కరించింది. అమూల్‌ను నెత్తిన పెట్టుకుని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పశుసంవర్థకశా ఖను రంగంలోకి దించింది. విశాఖ, హెరిటేజ్‌లకు పాలసేకరణ బాగా జరుగుతున్న ప్రాంతాల్లో అమూ ల్‌కు పాల సేకరణ భారీగా ఉండేలా పశుసంవర్థక శాఖ అధికారులను వాడుకుంది. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల్లో అమూల్‌కు పాల సేకరణ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 2వేలకు పైగా ఆర్‌బీకేల్లో పాలసేకరణ జరిగేలా రైతులపై ఒత్తిడి తెచ్చింది. అమూల్‌కే పాలు సరఫరా చేయకపోతే సంక్షేమ పథకాల్లో కోత తప్పదనే హెచ్చరికలు పంపింది. ఇలా ఒక్కో ఆర్‌బీకే పరిధిలో ఏఎంసీల ద్వారా రోజుకు 160 లీటర్ల వరకు పాల సేకరణ జరిగేలా రైతులను ఒప్పించింది. పాల సేకరణ పక్కాగా ఉండేలా కాకి నాడ జిల్లాలో 200 మహిళా డెయిరీ సహకార సం ఘాలను ఏర్పాటుచేశారు. కోనసీమ జిల్లాలో 200, తూర్పుగోదావరి జిల్లాలో 154 సంఘాలను అధికారు లు సిద్ధంచేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆయా గ్రా మాల్లో సేకరించిన పాలను నిల్వచేసేందుకు వీలుగా మండలాల్లో పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఒక్కో కేంద్రంలో 2 వేల లీటర్ల పాల సామర్థ్యం ఉండేలా చూశారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో కేం ద్రానికి ప్రభుత్వం అప్పట్లో రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్‌, యూపీఎస్‌, ఇన్వర్టర్‌, ప్రింటర్‌, పాల విశే ్లషణ యంత్రం, నాలుగు క్యాన్లు, కొలతల స్కేల్‌ వం టి 11 రకాల సామగ్రిని కోట్ల ఖర్చుతో అందించింది.

కోట్లకు కోట్లు అమూల్‌‘పాలు’

మండలాల్లో సేకరించిన పాలను ఒకేచోటకు చేర్చ డానికి వీలుగా బల్క్‌మిల్క్‌ కూలింగ్‌(బీఎంసీ) సెంట ర్లను సైతం అప్పట్లో జగన్‌ ప్రభుత్వమే అమూల్‌ కోసం నిర్మించింది. వీటికి స్థలాలు లేకపోతే ఆగమే ఘాలపై సేకరించింది. కాకినాడ జిల్లాలో నేమాం, రేఖవానిపాలెం, గంగనాపల్లి, పనసపాడులో బీఎంసీల ను నిర్మించింది. ఒక్కో భవనం నిర్మాణం, అందులో శీతలీకరణ యంత్రాలకు కలిపి రూ.18 లక్షల వరకు ఖజానా నుంచి వ్యయం చేసింది. కోనసీమ జిల్లాలో అమలాపురం, గోపాలపురం, వాడపల్లి, రాయవరం, జెడ్‌.మేడపాడులో మొత్తం ఐదు, తూర్పుగోదావరి జి ల్లాలో కోరుకొండలోని భూపాలపట్నం, రాజానగరం లోని జంబూపట్నంలో చెరొక బీఎంసీని నిర్మించింది. ఇలా లక్షలకు లక్షలు వెచ్చించి భవనాలు, యంత్రా లను అమూల్‌ కోసం నాటి జగన్‌ ప్రభుత్వం సమకూ ర్చింది. జగన్‌ సర్కారు అధికారంలో ఉన్నంతవరకు అమూల్‌కు పాల సేకరణకు పెద్దగా ఢోకా రాలేదు. అధికారుల ఒత్తిడితో పాల సేకరణ సజావుగానే సా గింది. గతేడాది ప్రభుత్వం మారడంతో మొత్తం రివ ర్స్‌ అయింది. అమూల్‌ను నెత్తిన పెట్టుకున్న అధికా రులు ప్రభుత్వం మారాక చేతులెత్తేశారు. దీంతో అమూల్‌కు పాలసేకరణ పడిపోయింది. ఏంఎంసీలు, బీఎంసీల నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో వీటిని కొన్నినెలలుగా అమూల్‌ వదిలించేసుకుంది. అటు పాలసేకరణ లేక బీఎంసీలు, అందులోని యంత్రాలు సైతం తప్పుపట్టిపోయిన పరిస్థితి నెలకొంది. మరో పక్క తమ కోసం ఖర్చంతా రాష్ట్రప్రభుత్వమే భరించ డంతో తమకు ఆర్థికంగా పోయిందేం లేదన్న కారణం తో అమూల్‌ సైతం ఎక్కడికక్కడ చడీచప్పుడు లేకుం డా బిచాణా ఎత్తేసింది. ఫలితంగా ప్రస్తుతం బీఎం సీలు ఈసురోమంటున్నాయి. శీతలీకరణ యంత్రాలు సైతం పాడైపోయే దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మ డి జిల్లాలో సేకరించిన పాలు నిల్వ కోసం రాజమహేంద్రవరంలోని గోదావరి డెయిరీ (దీన్నే విజయ డెయిరీ అంటారు)ని అధీనంలోకి తీసుకోవాలని అప్ప ట్లో ప్రభుత్వం భావించింది. ఇది కుదరకపోవడంతో తునిలోని రేఖవానిపాలెంలో ఓ పాత చిల్లింగ్‌ సెంట ర్‌ను లాక్కున్నారు. ప్రస్తుతం ఇక్కడకు వచ్చే పాలు కూడా పడిపోవడంతో అమూల్‌ బోర్డును తొలగించే సింది. ఇక ఉమ్మడి జిల్లాలో అమూల్‌ కోసం 968 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 68 సెం టర్ల నిర్మాణం చేపట్టింది. స్థలాల సమస్య, నిధుల కొరతతో మిగిలినవి ముందుకు కదల్లేదు. లేదంటే వందకోట్లకుపైగానే ప్రజాధనం అమూల్‌ పాలయ్యేవి.

అందరికీ ఉపయోగపడేలా..

అమూల్‌కు పాలుపోయడానికి రైతులు ఆసక్తి చూపకపోవడం, గత వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బీఎంసీలు మూలనపడ్డ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, యంత్రాలను దారికి తెచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించింది. అందులో భాగంగా అమూల్‌ కోసమే నిర్మించిన వీటిని ఇకపై అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తోంది. ముందుగా ఉమ్మడి జిల్లాలోని బీఎంసీలకు టెండర్లు పిలిచి వీటిని ఆసక్తి ఉన్న డెయిరీలకు అప్పగించాలని నిర్ణయించింది. టెండర్లలో పాల్గొన్న కంపెనీలు నామమాత్రపు నెలవారీ రుసుముతో వీటిని దక్కించుకుని పాలసేకరణ పెంచుకునేలా ప్రభుత్వం విదివిధానాలు రూపొందించింది. త్వరలో ఖరారుకానున్న టెండర్లలో విశాఖ, విజయ, హెరిటేజ్‌, హ్యాట్‌సన్‌ ఇలా ఏ కంపెనీ వీటిని దక్కించుకున్నా బీఎంసీల నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతోపాటు ఇక్కడకు వచ్చే పాలను ఏకంపెనీ అయినా మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే అమూల్‌ గుత్తాధిపత్యాన్ని తొలగించి పాలను ఏ కంపెనీకి అయినా విక్రయించుకునే వెసులుబాటును పాడి రైతులకు కల్పించబోతోంది.

Updated Date - Jun 24 , 2025 | 01:38 AM