అయ్యో పాపం మూగజీవం!
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:25 AM
అయ్యో పాపం మూగజీవాలు.. యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కానరావడం లేదు.. అడపాదడపా పట్టుకుంటారు.. గోశాలలకు తరలించి వదిలేస్తారు..
రంగంపేట, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి) : అయ్యో పాపం మూగజీవాలు.. యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కానరావడం లేదు.. అడపాదడపా పట్టుకుంటారు.. గోశాలలకు తరలించి వదిలేస్తారు.. మళ్లీ అవే గోవులను తరలించుకుపోతున్నారు.. పట్టుకుంటే ఉప యోగం ఏముంది.. ఇక్కడ పట్టుకుం టారు..గోశాలలో వదిలేస్తారంతే.. ప్రస్తుతం గోవుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగు తోంది.. ఎక్కడైనా పోలీస్ ఎదురైనా రూ.100.. రూ.200లు ఇస్తుంటే వదిలేస్తున్నారు.. కనీసం అయ్యోపాపం అనే ఊసేలేదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పశువుల సంతలు నిర్వహించే ప్రాంతాల నుంచి గోవులు ఎక్కువగా గోశాలలకు తరలిపోతున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో అయితే గోకవరంలో పెద్ద పశువుల సంత జరుగుతుంది. ప్రతి వారం ఇక్కడ నుంచి అక్రమ రవాణా సాగుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడి, ఆలమూరు తదితర ప్రాంతాల్లో పశువుల సంతలు జరుగుతున్నాయి. ఆ సంతల సాక్షిగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది..అధికారులకు అంతా తెలిసినా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.. గోవులను కుక్కికుక్కి తరలించేస్తున్నారు. గత నెల 17వ తేదీన రంగంపేటలో పోలీసులు ఒక ఐషర్ వ్యాన్ తనిఖీ చేయగా అందులో గోవులను ఇలా కుక్కేసి తరలించేస్తున్నారు. అయ్యా ఉన్నతాధికారులు గోవుల అక్రమరవాణాపై దృష్టి పెట్టండి.. గోవధ శాలలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయండి.. మూగజీవాలను కాపాడండి.
Updated Date - Apr 30 , 2025 | 12:25 AM