ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమాలిలో ఎడ్ల పరుగు పోటీలు

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:26 AM

ఏలేశ్వరం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో నేరేళ్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహిం చిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 50 జతలు పాల్గొన్నాయి. వీటిలో సీనియర్స్‌ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అం

పోటీల్లో పరుగులు తీస్తున్న ఎడ్లు

ఏలేశ్వరం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో నేరేళ్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహిం చిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. 50 జతలు పాల్గొన్నాయి. వీటిలో సీనియర్స్‌ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గుమ్మిలేరు గ్రామానికి చెందిన కోరా వీరవెంకట సత్యవేణి ఎడ్లు, కాకినాడ జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన మట్టా నవనీత్‌ మణికంఠ ఎడ్లు, తూర్పు గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన కుంచం మనోజ్‌ రామలింగేశ్వర ఎడ్లు నిలిచాయి. జూనియర్‌ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కాకినాడ జిల్లా చేయివాడ గ్రామానికి గడ్డం అప్పారావు ఎడ్లు, పశ్చిమ గోదావరి జిల్లా దుళ్ల గ్రామానికి చెందిన బడామాను శ్రీను ఎడ్లు, తూర్పుగోదావరి జిల్లా కాపరం గ్రామానికి చెందిన బండారు శ్రీను ఎడ్లు నిలిచాయి. సీనియర్స్‌లో ప్రథమ బహుమతిగా రూ.12,000, మెమెంటో.. ద్వితీయ బహుమతిగా రూ.10,000, మెమెంటో.. తృతీయ బహుమతిగా రూ.8,000 మెమెంటో లను అందజేశారు. జూనియర్స్‌లో ప్రథమ బహుమతిగా రూ.10,000, మెమెంటో... ద్వితీయ బహుమతిగా రూ.8,000, మెమెం టో.. తృతీయ బహుమతిగా రూ.6,000, మెమెం టోలను ప్రత్తిపాడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అందజేశారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:26 AM