మన దైవం కాటన్
ABN, Publish Date - May 16 , 2025 | 01:14 AM
ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం కాటన్ మహాశయుడు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు
కడియం, మే 15(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం కాటన్ మహాశయుడు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.సర్ ఆర్ధర్‌కాటన్ నర్సరీ అసోసియేసన్ కార్యాలయం వద్ద అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్య ప్ప, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో కాటన్ జయంతి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ రాష్ట్ర వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శి డా.గో రంట్ల రవిరామ్‌కిరణ్ కాటన్ మహాశయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. కడియం నర్సరీరంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉం టుందని తెలిపారు.అనంతరం మంత్రి దుర్గేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు డా.గో రంట్ల రవిరామ్‌కిరణ్‌లను నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు.కార్యక్రమంలో నర్సరీ సంఘం ఉపాధ్యక్షుడు బోడపాటి గోపి, ఐఎన్‌ఏ మాజీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, పుల్లా అబ్బులు, ఇన్‌చార్జి సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, ముద్రగడ జమీ, మార్గాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల చిన్నారి.. రూ.4 లక్షల సాయం
చిన్నారికి తీవ్ర అనారోగ్యం.. మంత్రి దుర్గేష్ దాతృత్వం
నిడదవోలు, మే 15 (ఆంధ్రజ్యోతి) : ఆ చిన్నారికి ఐదు రోజులు..అయితే గుండె, ఊపిరితిత్తుల సమస్యతో జన్మించింది.. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన పసలపూడి నాగచంద్రంకు ఈ నెల 11వ తేదీన ఒక చిన్నారి జన్మించింది. అయితే చిన్నారి పుట్టిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ఎందుకంటే పెద్ద అనారోగ్య సమస్యలో జన్మించడంతో రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు ఉన్న కాస్తపాటి సొమ్ము చిన్నారి వైద్యానికి ఖర్చు చేసేశారు. ఇక చేసేది లేక ఏం చేద్దామా అని ఆలోచనలో పడ్డారు. ఈ విషయం అమరావతిలో కేబినెట్ మీటింగ్‌లో ఉన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిసింది. అంతే ఆయన వెంటనే స్పందించారు. ఆ చిన్నారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు 24 గంటల లోపుగానే రూ.4 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎన్‌వోసీ)ని మంజూరు చేయి ంచారు. ఆ చిన్నారికి తక్షణ వైద్య చికిత్స అందించాలని సూచించారు.
Updated Date - May 16 , 2025 | 01:14 AM