బ్యారేజ్..డామేజ్!
ABN, Publish Date - May 22 , 2025 | 12:23 AM
ఆత్రేయపురం, మే 21(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న కాటన్ బ్యారేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్‌ఆర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. కానీ దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చి మొక్కలు పె
అస్తవ్యస్తంగా కాటన్ బ్యారేజీ నిర్వహణ
వెలగని విద్యుత్ దీపాలు
పెరిగిపోయిన పిచ్చిమొక్కలతో బీటలు
రహదారిపై గోతులతో ప్రజలకు పాట్లు
ఆత్రేయపురం, మే 21(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా ఉన్న కాటన్ బ్యారేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్‌ఆర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. కానీ దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చి మొక్కలు పెరిగిపోయి బీటలు వారుతుంది. వీటిని తొలగించే నాధుడు కరువయ్యాడు. బ్యారేజీ పొడవునా విద్యుత్ దీపాలు వెలగక రాత్రి వేళల్లో ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు. చిమ్మచీకటిలో వెళ్తూ అవస్థలు పడుతున్నారు. ఈ బ్యారేజీ తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా పరిధిలోకి విస్తరించి ఉంది. గత ప్రభుత్వ హయాంలో బ్యా రేజీ రహదారి అధ్వానంగా మారింది. ప్రయాణం నరకప్రాయంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం రహదారిని నిర్మించింది. అయితే ఏడాది గడవకుండానే బొబ్బర్లంక మెగా ప్రాజెక్టు వద్ద రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వాటిల్లో వర్షాలకు నీళ్లు ఉండిపోయి మరింత పెద్దగా మారుతున్నాయి. ఇరిగేషన్ సిబ్బంది నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో బ్యారేజీ అధ్వాన స్థితికి చేరుకుంది. బ్యా రేజీ అందాలను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. చరిత్ర గల బ్యారేజీ మ నుగడను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - May 22 , 2025 | 12:23 AM