రుణం..ఈజీకాదు!
ABN, Publish Date - May 05 , 2025 | 12:30 AM
రుణం అంత ఈజీకాదు.. ప్రభుత్వం తరపున అర్హులని ఎంపిక చేసినా సరే రుణం రాదు.. వెనుక ఏదో ఒక హామీ లేనిదే బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రావు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం..అటు పాలకుల నుంచి ఇటు అధికారుల వరకూ చెప్పేది ఇదే..
కార్పొరేషన్ రుణాలకు చుక్కలు
6,178 మంది లబ్ధిదారుల ఎంపిక
1,423 మందికే లోన్లు మంజూరు
మిగిలిన దరఖాస్తులు పెండింగ్
రుణాలివ్వడానికి బ్యాంకుల కొర్రీలు
రకరకాల కారణాలతో మోకాలడ్డు
ఉమ్మడి జిల్లాలో లక్ష్యానికి తూట్లు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
రుణం అంత ఈజీకాదు.. ప్రభుత్వం తరపున అర్హులని ఎంపిక చేసినా సరే రుణం రాదు.. వెనుక ఏదో ఒక హామీ లేనిదే బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రావు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం..అటు పాలకుల నుంచి ఇటు అధికారుల వరకూ చెప్పేది ఇదే.. వారిచెప్పినట్టు జరుగుతుందా అంటే జరగదు.. కార్పొరేషన్ రుణాలే అందుకు ఉదాహరణ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,303 యూనిట్లకు అర్హులను ఎంపిక చేసి 19 బ్యాంకులకు పంపగా కేవలం 1423 మందికి మాత్రమే రుణాలివ్వడానికి ముందుకు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ల రుణాలకు బ్యాంకులు కొర్రీలు వేస్తున్నాయి. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురా వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నా యి. లబ్ధిదారులను వడపోత ద్వారా అర్హులను పక్కాగా గుర్తించి రుణాల మంజూరుకు జాబి తాలను బ్యాంకులకు పంపితే రకరకాల సాకుతో తిరస్కరించేస్తున్నాయి.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పథకాలకు ఎంపిక చేసిన 6,178 మంది లబ్ధిదారుల వివరాల ను 19 బ్యాంకులకు పంపగా వీరిలో కేవలం 1,423 మందికి మా త్రమే రుణాలివ్వడానికి ఆమోదం తెలిపాయి. మిగిలిన దరఖాస్తుల్లో కొన్ని తిరస్కరించగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉంచేశాయి.
ఎంపికకే నానా తంటాలు..
గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ,కాపు, ఈ డబ్ల్యూఎస్ రుణాలకు మంగళం పాడేసింది. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అందివ్వాల్సిన యూనిట్లను సైతం పక్కన పడేసింది. దీంతో ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో వేలాది మంది బీసీ, కాపు సామా జికవర్గాల పేదలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చం ద్రబాబు తాజాగా సీఎం అయిన తర్వాత మళ్లీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 7,303 యూ నిట్లు కేటాయించారు. స్వయం ఉపాధి యూని ట్లకు వీలుగా 50 శాతం సబ్సిడీతో రుణం ఇప్పించాలని నిర్ణయించింది. ఉదాహర ణకు ఎంపికైన లబ్ధిదారుడు జనరిక్ మందుల దుకాణం ఏర్పాటకయ్యే రూ.8 లక్షల్లో రూ.4 లక్షలు రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ భరిస్తుండగా మి గిలిన రూ.4 లక్షలు రుణం మంజూరు చేస్తారు. ఇలా రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలకు లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశిం చింది.ఈ పథకానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీ గా స్పందన వచ్చింది. మంజూరైన యూనిట్లు 7,303 దరఖాస్తు చేసుకున్నవారు 1.11 లక్షల మంది.ఎలాగైనా పథకం తమకే దక్కాలని అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఫార్సు చేయి ంచారు. దరఖాస్తులన్నీ పరిశీలించిన అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7,303 మంది లబ్ధిదా రులను అతికష్టంపై ఎంపిక చేశారు. కాకినాడ జిల్లా నుంచి 2,684 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2,314, కోనసీమ జిల్లా నుంచి 2,305 మందిని ఎంపిక చేశారు. వీరికి ప్రభుత్వం తర పున సబ్సిడీ అందేలా ప్రభుత్వానికి ప్రతి పాద నలు పంపారు.వీరందరికి బ్యాంకు రుణాలు అందేలా ఆయా మండలాల్లో ఎండీవోలు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లకు సిఫార్సు చేశా రు.సబ్సిడీ పోను మిగిలిన సగం రుణం కింద ఇవ్వాలని యూనిట్ల వివరాలతో పంపించారు.
పేదలకు సిబిల్ స్కోర్ లేదట?
ఉమ్మడి జిల్లాలో ఆయా మండలాల వారీగా ఎండీవోలు లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు పంపించారు. తీరా వీటిని పరిశీలించిన బ్యాం కులు రుణాలివ్వడానికి నానా తిప్పలు పెడుతు న్నాయి. లబ్ధిదారుడి సిబిల్ స్కోరు బాగోలేదని.. గతంలో బ్యాంకు రుణం సరిగ్గా చెల్లించలేదని, గతంలో వేరే పథకానికి ఎంపికయ్యారని తది తర కారణాలతో ఎక్కడికక్కడ రుణాలివ్వ కుం డా తిరస్కరిస్తున్నాయి.ఎంపిక చేసిన యూనిట్ కు రుణం ఇవ్వడానికి కుదరదంటూ రకరకాల సాకులు చెబుతున్నాయి. కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులంతా నిరుపేదలు.వీరికి అసలు సిబిల్ స్కోరు గురించి కనీస అవగా హన ఉండదు.కానీ ఆ పేరుతో రుణాలు ఇవ్వ కుండా తిరస్కరిస్తుండడంతో ఆయా పేద లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చొరవ చూపి పేదలకు సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవా లని అధికారులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లాలో ఇలా..
కాకినాడ జిల్లాలో 19 బ్యాంకులకు అధికా రులు 2,478 మందిని ఎంపిక చేసి దర ఖాస్తులు జాబితా పంపారు. వీటిలో కేవ లం 722 మందికే బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి.199 తిరస్కరించగా 1,557 పెండింగ్‌లో ఉంచేసి వీటిని కూడా రేపోమాపో తిరస్కరిస్తున్నట్టు వెల్లడించ నున్నాయి. ఎస్‌బీఐకి 773 దరఖాస్తులు పంపితే 243 మంజూరు చేసి 98 దరఖా స్తులను తిరస్కరించింది. మరో 432 దర ఖాస్తులను పెండింగ్‌లో ఉంచేసింది. యూనియన్ బ్యాంకుకు 746 మంది జా బితా పంపితే 242 మందికే రుణాలు మంజూరు చేసింది. 40 దరఖాస్తులను తి రస్కరించి 464 పెండింగ్‌లో ఉంచేసింది.
తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లాలో 15 బ్యాంకులకు 2,062 మంది జాబితా పంపగా కేవలం 353 మందికే రుణాలివ్వడానికి అంగీక రించాయి. 66 మంది రుణ దరఖాస్తులు తిరస్కరించగా 1,643 పెండింగ్‌లో ఉం చేశాయి. స్టేట్ బ్యాంకుకు 657 దరఖా స్తులు పంపితే 84 మంది రుణాలకు మాత్రమే ఓకే చెప్పింది. 12 మందివి తిర స్కరించి 511 పేర్లు పెండింగ్‌లో ఉం చేసింది. ఇండియన్ ఒవర్సీస్ బ్యాంకుకు 57 పేర్లు పం పితే ముగ్గురికే రుణం మంజూరు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ,పం జాబ్ నేషనల్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు ఒక్క లోను ఇవ్వలేదు.
కోనసీమ
కోనసీమ జిల్లాలో 14 బ్యాంకులకు 1,638 పేర్లు పంపితే 348 మందికి మాత్రమే లోన్లు మంజూరయ్యాయి. 205 దరఖా స్తులు తిరస్కరించగా 1,085 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచేశాయి.కెనరా బ్యాంకుకు 100 పంపితే 35 మందిని తిరస్క రిం చింది.చైతన్య గోదావరి గ్రామీణ బ్యాం కుకు 115 పంపితే 30 తిరస్క రించింది. స్టేట్‌బ్యాంకుకు 509 పంపితే 34 మందికే రుణాలిచ్చి 21 పేర్లు తిరస్కరించింది. యూనియన్ బ్యాంకుకు 532 పంపితే 161 మందికే లోన్లు ఇవ్వగా 85 తిరస్క రించింది. వేలల్లో పేర్లను బ్యాంకులు తిర స్కరిస్తుండడంతో అటు బీసీ కార్పొరేషన్, ఇటు ఎండీవోలు తలలు పట్టుకుంటున్నా రు.ఒకనైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.
Updated Date - May 05 , 2025 | 12:30 AM