కాంట్రాక్టర్ల వెనకడుగు
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:42 AM
గతంలో సర్కారు పనులంటే కాంట్రాక్టర్లు క్యూకట్టేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం కాం ట్రాక్టర్లను భయపెట్టి వదిలేసింది.. దీంతో పను లు చేయడానికి ముందుకు రావడంలేదు.
చెల్లించాల్సింది రూ.47 కోట్లు
రోడ్లకు ఉపాధి నిధులు
రూ.84 కోట్ల పనులకు ఆదేశం
ముందుకు రాని కాంట్రాక్టర్లు
సర్కారు పనులపై అనాసక్తి
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
గతంలో సర్కారు పనులంటే కాంట్రాక్టర్లు క్యూకట్టేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం కాం ట్రాక్టర్లను భయపెట్టి వదిలేసింది.. దీంతో పను లు చేయడానికి ముందుకు రావడంలేదు. నిధు లిస్తేనే పనులు చేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంటున్నారు. పంచాయతీ రాజ్ ద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి నియోజకవర్గానికి రూ.12 కోట్ల వంతున సీసీ,బీటీ రోడ్ల నిర్మాణా నికి నిధులు మంజూరు చేశారు.జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో మొత్తం రూ.84 కోట్లతో సుమారు 700 సీసీ, బీటీ రోడ ్లను నిర్మించ నున్నారు. డ్రెయిన్ల పనులకు ఏ విధమైన శాం క్షన్లు లేవు. కనీసం ఈ రోడ్ల పనులైనా మొదల వుతాయంటే పల్లె పండుగ బిల్లులు పెండింగ్ ఉండడంతో ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఇదీ కారణం...
తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మా ణంపై దృష్టి పెట్టారు. పల్లె పండుగ పేరుతో గత అక్టోబరు నుంచి మార్చి వరకూ జిల్లాలో అనేక ఉపాఽధి హామీ పథకం కింద రూ. 65.92 కోట్ల నిధులతో జిల్లాలో మొత్తం 667 సీసీ రోడ్లు నిర్మించారు. జిల్లాలో చిన్నా పెద్ద కాంట్రా క్టర్లు సుమారు 50 మందికి పైగా ఈ పనులు చకచకా చేశారు. అధికారులు ముందుగా మే ల్కొనకపోవడం వల్ల కాబోలు గత మార్చి చివరికే మంజూరు కావాల్సిన బిల్లు లు కదల్లేదు. కేవలం రూ.19 కోట్లు చెల్లిం చారు.ఇంకా రూ.46 కోట్ల 92 లక్షల 80 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు వస్తేనే కొత్త పనుల్లో కదలిక వస్తుంది.
కాంట్రాక్టర్ల ఎదురుచూపు..
పల్లె పండుగ నిధులు రాక కాంట్రాక్టర్లు విలవిల్లాడుతున్నారు. రూ. 50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన వారు ఉన్నారు.పాత బిల్లులు వచ్చేస్తే.. కొత్త రోడ్ల నిర్మాణానికి ముందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. వర్షాల వల్ల చాలా రోడ్లు పాడైపో తున్నాయి. ప్రస్తుతం మంజూరైన నిధులతో పనులు చేస్తే గ్రామాల్లో మరిన్ని మౌలిక సదుపాయలు కల్పించినట్టు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి.
పల్లె పండుగ పనులు ఇలా..
మండలం పనులు బిల్లులు(కోట్లలో)
అనపర్తి 50 3.33
బిక్కవోలు 70 3.49
రంగంపేట 43 3.64
కొవ్వూరు 10 2.23
చాగల్లు 11 0.85
తాళ్లపూడి 17 2.21
ఉండ్రాజవరం 57 3.00
నిడదవోలు 84 4.09
పెరవలి 39 3.80
గోపాలపురం 12 1.43
దేవరపల్లి 18 2.36
నల్లజర్ల 38 4.67
రాజానగరం 32 4.00
కోరుకొండ 19 7.55
సీతానగరం 5 1.70
గోకవరం 50 10,75
రాజమండ్రి రూరల్ 96 4.44
కడియం 16 2.34
Updated Date - Jul 30 , 2025 | 12:42 AM