కలెక్టరేట్‌లో 200 అర్జీల స్వీకరణ
ABN, Publish Date - May 06 , 2025 | 01:55 AM
అర్జీల పరిష్కారంలో ఫిర్యాదుదారుల సంతృప్తే లక్ష్యంగా జవాబుదారీతనంతో వాటికి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు.
అమలాపురం టౌన్, మే5(ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారంలో ఫిర్యాదుదారుల సంతృప్తే లక్ష్యంగా జవాబుదారీతనంతో వాటికి పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వో రాజకుమారి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు మధుసూదన్, జైచంద్రగాంధీ, ఎస్టీసీ కృష్ణమూర్తి, డీఎల్డీవో రాజేశ్వరరావు తదితరులు ఫిర్యాదుదారుల నుంచి 200 ఆర్జీలను స్వీకరించారు. ప్రతీ అర్జీ స్థాయి అంచనా వేసి ఫిర్యాదును విశ్లేషించి న్యాయపరంగా పరిష్కారం చూపినప్పుడే ఈ తరహా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా, ఒకే ఫిర్యాదు మళ్లీమళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూంచించారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు. జేసీ నిషాంతి మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీల స్థాయిని బట్టి పెండింగ్‌లో లేకుండా పరిష్కారం చూపాలన్నారు. అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారులకు వివరించాల్సిందిగా జేసీ సూచించారు. జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి 24 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతులను అందించారు.
Updated Date - May 06 , 2025 | 01:55 AM