రైతులకు నష్టం లేకుండా పనులు చేయండి
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:58 AM
రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఆర్వోబీ నిర్మాణ పనులు చేయా లని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించా రు.
నిడదవోలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఆర్వోబీ నిర్మాణ పనులు చేయా లని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించా రు. నిడదవోలు పట్టణంలో గోదావరి కెనాల్ రోడ్డులో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులను మంగళవారం ఆర్‌అండ్‌బీ, ఇరి గేషన్ అధికారు లతో కలిసి ఆమె పరిశీలి ంచారు. ఎక్స్‌పర్ట్ కమిటీ క్షేత్రస్తాయిలో తని ఖీలు నిర్వహించి రైతాంగానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిపాదించిన అంశా లపై నివేదిక అందజేయాలని సూచించారు. ఆర్వోబీ నిర్మాణ పనులు వేగవంతం చేసే క్రమంలో రైతులు వెల్లడిస్తున్న అభ్యంతరా లకు సహేతుకమైన పరిష్కరమార్గం చూపా లన్నారు. దారవరం గ్రామానికి చెందిన రైతులు పంట పొలాలు ముంపునకు గురవు తాయని ముంపునకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారని అన్నారు. రైతాంగానికి మేలు చేసే క్రమంలో భూ సమతుల్యత, ఎత్తుపల్లాలను గుర్తించి తగిన నివేదిక అందజేయాలన్నారు. ఎర్రకాలువ వరద వచ్చినప్పుడు ముంపు ప్రమాదం నేపఽథ్యంలో పరిష్కారానికి అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల బృందం ఆర్డీవో, రైల్వే ఇంజనీర్స్, ఇరిగేషన్ ఎస్‌ఇ, జిల్లా వ్యవ సాయ శాఖాధికారులతో కలసి మరొకసారి వాస్తవ పరిస్థితులను అంచనా వేయవలసి ఉంటుందన్నారు. ఆమె వెంట ఆర్డీవో రాణీ సుస్మిత,జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్. మాధవరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రూప్ కు మార్, డీఈ వెంకటరమణ ఉన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:58 AM