ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం దిగుబడిని బట్టి లక్ష్యం ఉండాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 01:06 AM

జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడి ఆధారంగా ధాన్యం సేకరణ లక్ష్యం నిర్దేశించుకోవాలని కలె క్టర్‌ పి.ప్రశాంతి సూచించారు

కలవచర్లలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 25 (ఆం ధ్రజ్యోతి) : జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడి ఆధారంగా ధాన్యం సేకరణ లక్ష్యం నిర్దేశించుకోవాలని కలె క్టర్‌ పి.ప్రశాంతి సూచించారు.కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి జేసీ ఎస్‌.చిన్నరాముడు, గెయిల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం. ప్రేమ్‌ కుమార్‌, డీఎస్‌వో ఎస్‌.భాస్కర రెడ్డి, జిల్లా సహకారి అధికారి ఎం. జనార్దన రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మా ధవరావు, తదితరులతో కలసి ధాన్యం సేకరణపై సమీక్షించారు. గ్రామ స్థాయి లో ఉన్న రైతు సేవా కేంద్రం నుంచి ధాన్యం సేకరణపై పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. గెయిల్‌ డి ప్యూటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కంట్రోలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయా లన్నారు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. జిల్లా సహకార అధికారి ఆధ్వ ర్యంలో పని చేసే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది చురుకైన పాత్ర పోషిం చాలని ఆదేశిం చారు.రైతు సేవా కేంద్రా లకు,బహిరంగ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమన్వయ శాఖల అఽధికారులు, సిబ్బం ది తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇండస్ట్రియల్‌ పార్క్‌ పూర్తి చేయండి

రాజానగరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను మే1వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులకు ఆదేశిం చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో 104 ఎకరాల విసీ ్తర్ణంలో రూ.60.65 కోట్లతో రూపుదిద్దుకోనున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఏపీఐఐసీ అధి కారు లతో కలిసి శుక్రవారం సందర్శించారు. పారిశ్రా మికవాడలో అభివృద్ధి పనులు స్వయంగా పరి శీలించారు.పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ తదితర సౌకర్యాలతో దాదాపు 80 శాతం మేర ఇప్పటికే అభివృద్ధి పనులు పూర్తయినట్లు కలెక్టర్‌ చెప్పా రు. పరిశ్రమల స్థాపనకు ఆయా కేటగిరీల వారిగా సబ్సిడీ సదుపాయం కల్పించే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్య క్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రమణా రెడ్డి, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సుధారాణి,ట్రాన్స్‌కో ఎస్‌ఈ తిలక్‌, జిల్లా అధికారులు రమణ, కుమార్‌, ఎన్‌వీ సత్యనారాయణ, రాజా నగరం తహశీల్దార్‌ జి.అనంతలక్ష్మి సత్యవతి దేవి, ఏఈ సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

డీపీఆర్‌వోగా బాలకృష్ణ

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 25 (ఆం ధ్రజ్యోతి): జిలా ్లపౌర సంబంధాల అధికారిగా వై.బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బాధ్యతలు స్వీకరించి ఆయన జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల జిల్లా చెరుకుమిల్లి మండలం ఆరేపల్లికి చెందిన బాలకృష్ణ ఆయన పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో మాస్టర్‌ ఇన్‌ జర్నలిజం చేశారు. 2022లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుల య్యారు.తూర్పుగోదావరి జిల్లాకు బాలకృష్ణను డీపీఆర్‌వోగా ప్రభుత్వం నియమించింది.

పీహెచ్‌సీల్లో ఓపీ పెంచండి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలని, ఓపీ సేవలు మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణులు, పిల్లలకు సంబంధించిన సేవలు, ల్యాబ్‌ టెస్టులు సంపూర్ణంగా అందించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై సంబంధిత వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏఎన్‌ఎంలతో పాటు వైద్య సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లకు ఇతర పనులు అప్పగించకుండా, పూర్తిగా ఆరోగ్యకేంద్రాల్లోనే వారి సేవలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పటల్‌ అభివృద్ధి కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు,మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వినూత్న, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:06 AM