ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏం బాబూ..అంతా ఓకేనా!

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:02 AM

దత్తత తీసుకోవడం అంటే డబ్బులిచ్చి వదిలేయడం కాదు.. వారి యోగక్షేమాలు తెలు సుకోవడం..అవసరమైన సాయం చేయడం..ఇదీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి మాట..

పోసిబాబు ఇంట్లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

తాళ్లపూడి, జూలై 23 (ఆంథ్రజ్యోతి) : దత్తత తీసుకోవడం అంటే డబ్బులిచ్చి వదిలేయడం కాదు.. వారి యోగక్షేమాలు తెలు సుకోవడం..అవసరమైన సాయం చేయడం..ఇదీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి మాట.. సీఎం చంద్రబాబు సందర్భంగా పీ4 కార్యక్ర మంలో కలెక్టరు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో చర్మకారుడు సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసు కున్న సంగతి విదితమే.ఈ మేరకు బుధవారం ఆమె పోసిబాబు నివాసానికి వెళ్లి మాట్లాడారు.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. నివాస నిర్మాణం, ఉపాధి అవకాశం కోసం సహాయాన్ని అందించేందుకు అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గృహ నిర్మాణ పనులు ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి అందచే యా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం ములపర్తి సుజాత గృహ పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ ఎస్‌.భాస్కరరెడ్డి, డీఈ టి.శేఖర్‌ బాబు,తహశీల్దార్‌ లక్ష్మీలావణ్య, ఎంపీడీవో వేణుగోపాలరెడ్డి, ఆర్‌ఐ రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 01:02 AM