మీ పాలన బాగుంది సార్..
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:14 AM
సీఎం నారా చంద్రబాబునాయుడు తన కారులో తన పక్క సీటులో ఓ సామాన్య చర్మకారుడిని కూర్చోపెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లిలోని అతడి ఇంటివరకూ వెళ్లారు. 2 కిలోమీటర్ల మేర పయనించారు.
రాజమహేంద్రవరం/కొవ్వూరు/తాళ్లపూడి, జూలై 1(ఆంధ్రజ్యోతి): సీఎం నారా చంద్రబాబునాయుడు తన కారులో తన పక్క సీటులో ఓ సామాన్య చర్మకారుడిని కూర్చోపెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లిలోని అతడి ఇంటివరకూ వెళ్లారు. 2 కిలోమీటర్ల మేర పయనించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా ఉం డడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్ర బాబు మలకపల్లిలో స్వయంగా పింఛను పంపిణీ చేయడానికి, పీ4 కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదిక మీద ప్రసం గించడానికి మంగళవారం వచ్చిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం విమానా శ్ర యం నుంచి కారులో వస్తూ కొవ్వూరు మం డలం ధర్మవరంలో ఓ కిరాణా కొట్టువద్ద ఆ గా రు. సరుకులు కొంటున్న వ్యక్తి వద్దకు వెళ్లి నీపే రేంటి? ఏంచేస్తున్నావ్ అని అడిగారు.?
ఫ చర్మకారుడు : నా పేరు సనమండ్ర పోసిబాబు అండి. చర్మకారుడిని. చెప్పులు కుట్టుకుని కుటుంబానికి పోషించుకుం టున్నా. సామాను కొనుక్కోవడానికి వచ్చా.
సీఎం : మీకు పింఛన్ ఇస్తున్నాం కదా?
పోసిబాబు : అవును అయ్యగారు.. మీరే అప్పట్లో రూ.వెయ్యిచ్చారు.ఇవాళ రూ.4 వేలు ఇస్తున్నారు.ఆనందంగా ఉందండి.
సీఎం : వయసు..ఆరోగ్యం ఎలా ఉంది..?
పోసిబాబు : నా వయసు 55 అండి. కాళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి సారు.కిడ్నీలో చిన్న ఫాల్ట్ కూడా ఉంది.
సీఎం : పాలన ఎలా ఉంది..?
పోసిబాబు : మీరు బాగా చేస్తున్నారు. వైఎస్‌ఆర్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. నాకు మీరు గతంలో ఇల్లు ఇచ్చారు. మీరు మారాక మధ్యలో ఆగింది. వైసీపీలో సాయం చేయలేదు. అది అలానే ఉండిపోయింది.
సీఎం : చదువుకోవాలనిపించలేదా?
పోసిబాబు : నేను ఇంటికి పెద్దకొడుకు నండి, మూడో తరగతి చదివించి..రోజుకు రూ.3లకోసం గేదెలు మకాం పెట్టించారు.
సీఎం : నేను ఒకటో తేదీన పేదల సేవలో.. ప్రజలకు అండగా ఉండాలని చెబుతున్నా,నీ అభిప్రాయం?
పోసిబాబు : మనల్ని చంద్రబాబు నాయుడుగారు బాగా చూస్తున్నారు అనే ఆలోచన ప్రజల మనసులో కలిగింది. వైఎస్ ఆర్‌కు వేసినా ఏమీ లేదని ఇవాళ ప్రజలు తెలుసుకున్నారండి.
సీఎం : ధనవంతులు పేదలకు దత్తత తీసుకుని సాయం చేస్తే ఎలా ఉంటుంది.?
పోసిబాబు : చాలా బాగుంటుంది. అభి వృద్ధి చెందుతారు.
సీఎం : నేనింకా బాగా చేయాలని ఆలోచిస్తున్నా.అందరినీ పైకి తీసుకురావా లన్నదే నా లక్ష్యం..
- (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
Updated Date - Jul 02 , 2025 | 01:14 AM