రేపు మలకపల్లిలో సీఎం పర్యటన
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:25 AM
: సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి సమీక్ష
కొవ్వూరు/తాళ్లపూడి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం (జూలై 1) పర్యటి స్తారన్నారు.కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో సీఎం పర్యటనపై వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు.అనంతరం నిర్వహించే గ్రామసభలో పీ 4 పథకం మార్గదర్శులు..లబ్ధిదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. గ్రామ సభ నిర్వహణ, హెలిప్యాడ్, రూట్‌మ్యాప్,మెడికల్‌క్యాంపు ఏర్పాటు, అగ్నిమాపకం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశా రు. గ్రామసభ వేదిక నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పూర్తిచేసి భద్రతా సిబ్బందికి వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పర్యటించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్,ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు,ద్విసభ్య కమిటీ సభ్యు డు కంఠమణి రామకృష్ణ, ఎస్పీ డి.నరసింహకిశోర్, జేసీ ఎస్.చిన్నరాముడు, డీఆర్వో టీ.సీతారామ్మూర్తి,డీఎస్పీ జి.దేవకుమార్,ఆర్డీవో రాణి సుస్మిత,సీపీవో ఎల్.అప్పలకొండ, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్.మూర్తి, డీఐపీఆర్‌వో కె.లక్ష్మీనారాయణ,హౌసింగ్ పీడీ ఎస్.భాస్కరరెడ్డి, డీటీసీ ఆర్.సురేష్, డీఎంహెచ్‌వోకె.వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్ బీవీ రెడ్డి, మద్దిపట్ల శివరామకృష్ణ,మద్దిపాటి ప్రకాశం, సర్పంచ్ రాపా క రాజేశ్వరి, కార్యదర్శి కామేశ్వరి, తహశీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 12:25 AM