ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం పర్యటనకు శరవేగంతో పనులు

ABN, Publish Date - May 30 , 2025 | 12:36 AM

ముమ్మిడివరం, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నెల 31న ముఖ్యమంత్రి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగమంతా అక్కడే ఉండి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహిపాలచెరువు, పల్లంకుర్రు ఆర్‌అండ్‌బీ రోడ్డును సీహెచ్‌ గున్నేపల్లి నుంచి చెయ్యే

చెయ్యేరులో ప్రజా వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం

ముమ్మిడివరం నియోజకవర్గంలో

రేపు చంద్రబాబు పర్యటన

సిద్ధమవుతున్న ప్రజా వేదిక

ముమ్మిడివరం, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంతో సాగుతున్నాయి. ఈ నెల 31న ముఖ్యమంత్రి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగమంతా అక్కడే ఉండి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహిపాలచెరువు, పల్లంకుర్రు ఆర్‌అండ్‌బీ రోడ్డును సీహెచ్‌ గున్నేపల్లి నుంచి చెయ్యేరు వరకు రోడ్డుపక్కన ఉన్న చెత్త, పిచ్చిమొక్కలను తీసివేసి శుభ్రం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ అయ్యేందుకు సీహెచ్‌ గున్నేపల్లిలోని పాత ఓఎన్జీసీ సైట్‌లో ఉన్న కొబ్బరి పీచును తొలగించి హెలిప్యాడ్‌ను ఆధునికీకరిస్తున్నారు. అక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రజావేదికకు సీఎం కాన్వాయ్‌ వెళ్లేందుకు హెలిప్యాడ్‌నుంచి మెయిన్‌రోడ్డుకు రోడ్డును ఆధునికీకరిస్తున్నారు. చెయ్యేరులో నిర్వహించే ప్రజా వేదికకు సంబంధించి వేదికను సిద్ధం చేస్తున్నారు. అక్కడ రోడ్లు కూడా ఆధునికీకరిస్తున్నారు. పేదల సేవలో భాగంగా ముగ్గురు పేదలను దత్తత తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజావేదికలో గ్రామస్తులతో మాట్లాడిన తరువాత ఉపాధిహామీ పథకంలో చెయ్యేరు ఆధునికీకరిస్తున్న చెరువును పరిశీలించి అక్కడ ఉపాధిహామీ కూలీలతో సీఎం మమేకమవుతారు. అక్కడ ఎంపికన చేసిన నలుగురి పెన్షనర్లతో మాట్లాడనున్నారు. మెయిన్‌ రోడ్డు నుంచి చెరువు వరకు రోడ్డును ఆధునికీకరించి అక్కడ భారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సీహెచ్‌ గున్నేపల్లిలో సత్తెమ్మతల్లి ఆలయ సమీపంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు వేదికను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ బందోబస్తు..

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. పోలీసు బలగాలు బస చేసేందుకు ముమ్మిడివరంలోని కల్యాణ మండపాలను సిద్ధం చేశారు. పోలీసు బలగాలంతా ముందురోజే ఇక్కడకు చేరుకోనున్నాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, రిజర్వుడు ఇనస్పెక్టర్లు ముగ్గురు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు 64 మంది, ఏఎస్‌లు, హెచ్‌సీలు, పోలీసు కానిస్టేబుళ్లు 492 మంది, మహిళా పోలీసులు 67 మంది, హోంగార్డులు 88 మంది మొత్తం 751 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీరు కాక ఆర్డ్మ్‌ రిజర్వ్డ్‌ పార్టీ 35 మంది, ఎనిమిది స్పెషల్‌ పార్టీలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సీఎం పర్యటనకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - May 30 , 2025 | 12:36 AM