పొగడ్తలు వినడానికి రాలేదు... పార్టీని బాగుచేయడానికి వచ్చా
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:43 AM
కొవ్వూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘కష్టపడిన కార్యకర్తకు అన్యాయం చేస్తే దేవుడు చెప్పినా ఊరుకోను. కార్యకర్తలు నేను చెప్పినట్టే చేయండి. మీ పొగడ్తలు వినడానికి రాలేదు. పార్టీని బాగుచేయడానికి వచ్చాను. పార్టీల్లో ఇబ్బందులు సృ ష్టించే వాళ్లను దూరం పెడతా, కొవ్వూరులో పాత రోజులు మరిపోండి. కొత్త రోజులకు శ్రీకారం చుట్టండి. సింగిల్ వాయిస్ ఉండాలి. ఎమ్మెల్యే, ద్వి సభ్య కమిటీ ఒకేమాటగా ఒకేతాటిపై నడవాలి. కొవ్వూరు నియోజకవర్గంపై
కొవ్వూరులో కొత్తరోజులకు శ్రీకారం చుట్టండి
బహునాయకత్వాన్ని ఒప్పుకోను
టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం
కొవ్వూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘కష్టపడిన కార్యకర్తకు అన్యాయం చేస్తే దేవుడు చెప్పినా ఊరుకోను. కార్యకర్తలు నేను చెప్పినట్టే చేయండి. మీ పొగడ్తలు వినడానికి రాలేదు. పార్టీని బాగుచేయడానికి వచ్చాను. పార్టీల్లో ఇబ్బందులు సృ ష్టించే వాళ్లను దూరం పెడతా, కొవ్వూరులో పాత రోజులు మరిపోండి. కొత్త రోజులకు శ్రీకారం చుట్టండి. సింగిల్ వాయిస్ ఉండాలి. ఎమ్మెల్యే, ద్వి సభ్య కమిటీ ఒకేమాటగా ఒకేతాటిపై నడవాలి. కొవ్వూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడ తా. గీత దాటితే ఉపేక్షించేది లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వివరాలను సేకరిస్తూనే ఉన్నాం’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోని ఏఎంసీ గొడౌన్ల వద్ద మంగళవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘పార్టీలో లీడర్‌షిప్ చూసి ఓట్లు వేస్తారు. నాయకుడు చేసే ప్రతి పనిని, సంక్షేమాన్ని ఇంటింటికి తెలియజేయాలి. ఓటు బ్యాంకు పెంచాలి. టీడీపీకి బలం బీసీ వర్గాలు. 144 కులాలు ఉన్నాయి, చిన్న కులాలకు మైక్రో లెవిల్ గుర్తింపు ఇవ్వాలి. నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా విషయంలో 225 ర్యాంకు. ఫేస్‌బుక్‌లో 2,432 పోస్టులు పెట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడి పోస్టులతో ఇది సమానం. యూట్యూబ్ చా నల్ లేనేలేదు. ఇంకా సోషల్ మీడియాలో స్పీడప్ కావాలి. కులాల వారీగా నాయకత్వం చెక్ చేసుకోండి’ అని చంద్రబాబు చెప్పారు. డమ్మీ లీడర్‌లను పెట్టుకుంటే పార్టీ డమ్మీ అయిపోతుందన్నా రు. వాయిస్ ఉండే నాయకులను పెట్టుకోవాలన్నారు. పబ్లిక్ ఒపీనియస్ సేకరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో బహునాయకత్వాన్ని ఒప్పుకునేది లేదన్నారు. అచ్చిబాబు ఉన్నారు. ద్విసభ్య కమిటీ ఉంది. బయట నియోజకవర్గాల్లో నాయకులు ఎక్కడా ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదన్నారు. అలా చేస్తే వారిని కట్ చేస్తానన్నారు. ఎమ్మెల్యేకి చెబుతున్నాను అందరిని కలుపురండీ అని. జవహర్‌కు గౌరవం ఎస్సీ క మిషన్ చై ర్మన్ ఇచ్చామన్నారు. రాష్ట్రం లో 8 వేల ను ంచి 9 వేల బూత్‌లలో మన కు మెజారిటీ రాలేదని, 10 వేలు మెజారిటీ వ చ్చి ఉంటే 175 కి 175 సీట్లు మనకు వచ్చేవన్నారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మండలానికి చెందిన కార్యకర్త మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చినా నా యకులకు గౌరవం దక్కడం లేదని, అధికారులే ఎంజాయ్ చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే మాట కలెక్టర్ వినడం లేదన్నారు. కొవ్వూరు మండలానికి చెందిన కార్యకర్త మాట్లాడుతూ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానికంగా ఉండడం లేదని, మీరు సెంట్రల్ జైల్లో ఉండగా నిరాహార దీక్ష చేశానని చెబుతుండగా సీఎం చంద్రబాబు అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొవ్వూరు జాతకం 45 సంవత్సరాలుగా నాకు తెలుసు. గ్రూపులు ఈ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ఉండడంలేదన్నారు. నిజమైన కార్యకర్తకు అన్యాయం చేస్తే దేవుడు చెప్పినా ఊరుకోన న్నారు. గ్రూపు రాజకీయాలు వద్దన్నారు. అయతే కొంతమంది కార్య కర్తలను సమావేశంలోకి అనుమతించక పోవడం తో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఎస్.రాజీవ్‌కృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, కొవ్వూరు ఎంపీపీ కాకర్ల నారాయణ, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, ఆళ్ల హరిబాబు, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, పొట్రు శ్రీనివాసరావు, నామాన పరమేష్, కొఠారు వెంకట్రావు, మద్దిపట్ల సురేష్, గొరిజాల సురేష్, చావా శ్రీనివాసరావు, బొల్లిన శివ నాగేం ద్ర, గెల్లా సురేష్, కొత్తపల్లి ఆశిష్‌లాల్, వరిగేటి కాంతరాజు, వేమగిరి వెంకట్రావు, పెనుమాక జయరాజు, ఎరుబండి వెంకట్రావు, 3 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:43 AM